Akshaya Tritiya 2022: మే 3న అక్షయ తృతీయ రోజు, మీ రాశి ప్రకారం ఏ దేవతను పూజిస్తే, మీకు ధనయోగం, ఉద్యోగం, వివాహం, విదేశీ యానం సఫలం అవుతాయో చెక్ చేసుకోండి.

వైశాఖ మాసంలో శుక్ల పక్షం యొక్క తృతీయ తిథిలో అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది అంటే 2022లో మే 03వ తేదీ మంగళవారం నాడు ఉదయం 5:39 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు అంటే మే 4వ తేదీన తెల్లవారు జామున 5:38 గంటల వరకు కొనసాగనుంది.

Akshaya Tritiya 2022: మే 3న అక్షయ తృతీయ రోజు, మీ రాశి ప్రకారం ఏ దేవతను పూజిస్తే, మీకు ధనయోగం, ఉద్యోగం, వివాహం, విదేశీ యానం సఫలం అవుతాయో చెక్ చేసుకోండి.
file pic

అక్షయ తృతీయ అనేది హిందువులు ఆచరించే పండుగలలో అతి ముఖ్యమైన పండుగ. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్షం యొక్క తృతీయ తిథిలో అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది అంటే 2022లో మే 03వ తేదీ మంగళవారం నాడు ఉదయం 5:39 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు అంటే మే 4వ తేదీన తెల్లవారు జామున 5:38 గంటల వరకు కొనసాగనుంది. ఈరోజున శుభకార్యాలు చేయడానికి చాలా పవిత్రమైనదని నమ్ముతారు.

ఈరోజున కచ్చితంగా బంగారం, వెండిని కొనాలని చాలా మంది ఆశపడతారు. అలాగే ఈ పవిత్రమైన రోజున కొత్త పనులు ప్రారంభించడం, శుభకార్యాలు చేయడం, కొత్త వ్యాపారాలు చేయడం వంటివి చేస్తారు. సంస్కృతములో అక్షయ అంటే నాశనం లేనిది లేదా అనంతం అని అర్ధం. అక్షయ తృతీయ రోజు ఏ పని చేసిన విజయం సిద్ధిస్తుందని మన పెద్దలు చెప్పుతున్నారు. అక్షయ తృతీయ రోజు అందరు ఎంతో కొంత బంగారం కొంటూ ఉంటారు.

రెప్పపాటులో కాటేసిన మృత్యువు, ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి, పిల్లలకు తీవ్ర గాయాలు, చివ్వెంల మండల పరిధిలో విషాద ఘటన

అక్షయ తృతీయ రోజు ఈ రాశుల వారు ఇలా చేస్తే జీవితంలో ఎలాంటి బాధలు,కష్టాలు లేకుండా సిరి సంపదలతో ఉంటారని పెద్దలు చెప్పుతూ ఉంటారు. ఇప్పుడు ఆ రాశుల వారు ఎవరో ఏమి చేస్తే అదృష్టం వస్తుందో వివరంగా తెలుసుకుందాం.

>> మేష రాశి వారు వినాయక,సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం మంచిది. ఆ రోజున పాయసం దానం చేస్తే సిరి సంపదలు కలుగుతాయి. అలాగే సుఖ శాంతులు కూడా లభిస్తాయి.

>> వృషభ రాశిలో జన్మించినవారు అంబికా దేవిని పూజించి చక్కర పొంగలి లేదా రవ్వ లడ్డు నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.

>> మిధున రాశి లో జన్మించినవారు విష్ణు,మహాలక్ష్మిలను అస్తోత్రాలతో పూజించి మీకు చేతనైన సాయాన్ని ఇతరులకు చేస్తే మీకు ఆర్ధికంగా బాగుంటుంది.

>> కర్కాటక రాశిలో జన్మించిన వారు దుర్గా దేవిని పూజించి నేతితో దీపాన్ని పెట్టి బియ్యంపిండితో తయారుచేసిన పదార్ధాలను దానం చేస్తే అనుకున్న పనులు త్వరగా జరుగుతాయి.

>> సింహ రాశిలో పుట్టినవారు పరమ శివుణ్ణి పూజించాలి.

>> కన్య రాశిలో జన్మించిన వారు లక్ష్మి నారాయణులను పూజించాలి.

>> తులా రాశిలో పుట్టిన వారు దుర్గా దేవిని పూజించాలి.

>> వృశ్చిక రాశివారు వినాయకుణ్ణి పూజించాలి.

>> ధనస్సు రాశివారు దక్షిణ మూర్తిని పూజించాలి.

>> మకర రాశివారు హనుమంతుణ్ణి పూజించాలి.

>> కుంభ రాశివారు శనీశ్వరుణ్ణి,హనుమంతుణ్ణి పూజించాలి.

>> మీన రాశివారు నందీశ్వరుని పూజించాలి.

(The above story first appeared on LatestLY on May 01, 2022 10:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).