Asttrology: డిసెంబర్ 2 బుధ గ్రహం దిశ మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
జ్యోతిష శాస్త్రం ప్రకారం బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ గ్రహాల కదలిక వల్ల అన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. అయితే డిసెంబర్ 2 సోమవారం రోజు బుధ గ్రహం తన దిశను మార్చుకుంటుంది. బుధుడు ఈ తేదీన గ్రహణ సమయంలో ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు.
జ్యోతిష శాస్త్రం ప్రకారం బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ గ్రహాల కదలిక వల్ల అన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. అయితే డిసెంబర్ 2 సోమవారం రోజు బుధ గ్రహం తన దిశను మార్చుకుంటుంది. బుధుడు ఈ తేదీన గ్రహణ సమయంలో ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు. దీనివల్ల అనేక ఆర్థిక లాభాలు ఉంటాయి. ముఖ్యంగా బుధుడు వ్యాపారం, ఆర్థిక లాభాలు వంటి వాటిని పాలించే గ్రహంగా ఉంటుంది. అయితే బుధ గ్రహం తన దిశను మార్చుకుంటుంది. దీని కదలిక వల్ల మూడు రాశుల వారికి సానుకూల ప్రభావాలు ఉంటాయి ఆ మూడు అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీన రాశి- మీనరాశిలో జన్మించిన వారికి బుధుడు సంచారం కారణంగా అనేక శుభ ఫలితాలు ఉంటాయి. వీరు ఏ నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా తెలివిగా ఆలోచించి తీసుకుంటారు. ఇది వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు పని చేసే చోట గౌరవం పెరుగుతుంది. వ్యాపార పరంగా అనేక లాభాలు ఉంటాయి. ఆకస్మికంగా ధన లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. ఇది మీకు మానసికంగా ఊరటను ఇస్తుంది.
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి,
కర్కాటక రాశి- కర్కాటక రాశి బుధ గ్రహం దిశమార్పు సమయంలో అనేక ఫలితాలను ఇస్తుం. ఇది మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీలో ఉన్న తెలివితేటలకు పదును పెడతారు. ఉద్యోగంలో ప్రమోషన్లు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని ద్వారా మీ జీతం రెట్టింపు అవుతుంది. మీరు పని చేసే చోట ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఇది మీకు ఆర్థికంగా బలాన్ని ఇస్తుంది. ఆకస్మిక ధన లాభానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పూర్వికుల నుండి వచ్చే ఆస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం లాభదాయకంగా మారుతుంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు.
ధనస్సు రాశి- ధనస్సు రాశి వారికి బుధుడు ఉత్తరం వైపు వెళ్లే దిశలు మార్చుకోవడం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు పని చేసే చోట వీరికి గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. కోర్టు సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలితాలు ఇస్తాయి. విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మంచి సమయం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. ఇది తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమ వివాహాలకు అనుకూలం కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.
(The above story first appeared on LatestLY on Nov 26, 2024 02:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

