Astrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం ,వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని సంకేతాలు త్వరలోనే కోటీశ్వరులు అవుతారని చూపిస్తాయి. వీటివల్ల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
వీరికి ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఆ మూడు సంకేతాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎర్ర చీమల గుంపు- మీ ఇంట్లో లేదా వ్యాపారం చేసే చోట ఎర్ర చీమల గుంపు కనిపిస్తే అది మీకు శుభసంకేతంగా చెప్పవచ్చు. దీనివల్ల రాబోయే రోజుల్లో మీరు కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అఖండ ధన ప్రాప్తి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ లక్ష్మీదేవి కటాక్షం మీ పైన ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ ఎర్ర చీమల గుంపు గనక మీకు కనిపిస్తే త్వరలోనే లక్ష్మీదేవి కటాక్షం మీ పైన ఉంటుందని అర్థం.
Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి,
పక్షి గూడు.. మీ ఇంటి ఆవరణంలోనూ లేదా బాల్కనీలో పక్షి గూడు గనక ఉన్నట్లయితే అది మీకు శుభసంకేతాలను అందిస్తుంది. మీరు త్వరలోనే కోటీశ్వరులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పక్షి గూడు ఎంతో శుభ సూచకం దీని ద్వారా మీరు కొత్త ఇంటిని నిర్మించుకునే అవకాశం కూడా ఉంటుంది.
కుడి చేతిలో దురద- మీకు నిరంతరం కుడి చేతిలో దురదగా అనిపిస్తే అది శుభసంకేతంగా చెప్పవచ్చు. దీనివల్ల మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోయి త్వరలోనే కోటీశ్వరులు అవుతారని నమ్మకం. మీకు త్వరలోనే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.