Astrology: జనవరి 5న గురు గ్రహం మీనరాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది సంపదను ఐశ్వర్యాన్ని ఇచ్చే గ్రహంగా ఈ గ్రహాన్ని చెప్తారు. అయితే ఈ గ్రహం జనవరి 5 తేదీన మీనరాశిలోకి ప్రవేశం దీని ద్వారా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది సంపదను ఐశ్వర్యాన్ని ఇచ్చే గ్రహంగా ఈ గ్రహాన్ని చెప్తారు. అయితే ఈ గ్రహం జనవరి 5 తేదీన మీనరాశిలోకి ప్రవేశం దీని ద్వారా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మీన రాశి- మీన రాశి వారికి గురు గ్రహం మీనరాశిలోకి ప్రవేశించడం ద్వారా అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది సంఘంలో మీ గౌరవం ప్రతిష్టలు పెరుగుతాయి. ఇల్లు కొనడానికి చేసే ప్రణాళికలు అన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశం ఉంది. సంపద పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో మీ వ్యాపారాన్ని పెంపొందించడానికి ప్లాన్ చేస్తారు. అనవసర ఒత్తిడి లకు దూరంగా ఉండటం ద్వారా విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారంలో భారీగా లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.
తులారాశి- తులారాశి వారికి 2025వ సంవత్సరం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. గురుడు మీనరాశిలోకి ప్రవేశించడం ద్వారా వీరికి అన్ని శుభ ఫలితాలే ఉంటాయి. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఇది మంచి సమయం. మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి అవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. మీరు చేసే ప్రతి పని కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహమయ్య అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలకు విహారయాత్రలకు వెళ్తారు. ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ధనస్సు రాశి- ధనస్సు రాశి వారికి గురు గ్రహం మీనరాశిలోకి ప్రవేశించడం ద్వారా అనేక శుభ ఫలితాలు ఉన్నాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో మంచి పదోన్నతి లభిస్తుంది పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగం చేసే వారికి ఇది మంచి సమయం వారి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులు వారి వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అనువైన సమయం వివాహం కాని వారికి వివాహమయ్య అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలని కల నెరవేరుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.
(The above story first appeared on LatestLY on Jan 01, 2025 04:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

