Diwali 2021: దీపావళి రోజున ఇంట్లో ఏ ప్రదేశాల్లో దీపం వెలిగించాలి, ఎక్కడ వెలిగిస్తే ఏమిటి లాభం, శాస్త్రాలు ఏం చెబుతున్నాయి..

దీపావళి పండుగ వాస్తవానికి చీకటిపై కాంతి విజయాన్ని సూచిస్తుంది. లక్ష్మిదేవి ఇంటిలో స్థిరంగా ఉండాలంటే పూజ తర్వాత కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో దీపాలను వెలిగించాలి. ఎక్కడెక్కడో తెలుసుకుందాం.

Diwali 2021: దీపావళి రోజున ఇంట్లో ఏ ప్రదేశాల్లో దీపం వెలిగించాలి, ఎక్కడ వెలిగిస్తే ఏమిటి లాభం, శాస్త్రాలు ఏం చెబుతున్నాయి..
Happy Diwali 2020 Rangoli Designs (Photo Credits: Instagram)

దీపావళి పండుగ వాస్తవానికి చీకటిపై కాంతి విజయాన్ని సూచిస్తుంది. లక్ష్మిదేవి ఇంటిలో స్థిరంగా ఉండాలంటే పూజ తర్వాత కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో దీపాలను వెలిగించాలి. ఎక్కడెక్కడో తెలుసుకుందాం.

దీపావళి రోజు రాత్రి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఖచ్చితంగా దీపం వెలిగించాలి. లక్ష్మిదేవి ఇంట్లోకి ప్రవేశించే ప్రదేశం ఇది. ఈ ప్రదేశాన్ని పువ్వులు మొదలైన వాటితో చక్కగా అలంకరించాలి. దీపావళి రోజు రాత్రి స్టోర్ హౌస్‌లో ఖచ్చితంగా దీపం వెలిగించాలి. మీ ధాన్యాలు మొదలైనవి స్టోర్ హౌస్‌లో ఉంచుతారు. కనుక లక్ష్మీదేవి సంతోషిస్తుందని దీని వల్ల ఇంట్లో ఎప్పుడూ ఆహార కొరత ఉండదని చెబుతారు.

ప్రతి వ్యక్తి తన ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యానికి లోటు రాకూడదని కోరుకుంటాడు. అందుకోసం దీపావళి రోజు రాత్రి మీ ఇంట్లోని డబ్బును ఉంచే స్థలంలో ఖచ్చితంగా దీపం వెలిగించాలి.

వాహనం కూడా ఆస్తిగా పరిగణిస్తారు. కాబట్టి దాని సమీపంలో సురక్షితమైన స్థలంలో దీపం వెలిగించాలి. ఇది ప్రమాదాలు మొదలైన వాటి నుంచి కుటుంబ సభ్యులను కాపాడుతుంది.

నీరు లేకుండా జీవితం సాధ్యం కాదు. అందుచేత కుళాయి, బావి లేదా మరేదైనా నీటి వనరు ఉన్నచోట దీపావళి రోజు రాత్రి పూజ చేసిన తర్వాత దీపం పెట్టాలి.

ఇంటి దగ్గర గుడి ఉంటే అక్కడ దీపం పెట్టాలి. గుడి లేకపోతే పూజగదిలో పడితే మంచిది. దీంతో లక్ష్మిదేవితో పాటు సకల దేవతామూర్తుల ఆశీస్సులు లభిస్తాయి.

రావి చెట్టులో 33 వర్గాల దేవతలు ఉంటారు. కాబట్టి ఈ చెట్టు దగ్గర దీపం పెట్టాలి. విష్ణువు స్వయంగా రావి చెట్టులో నివసిస్తాడని నమ్ముతారు. ఆయనను ఆరాధించడం వల్ల లక్ష్మీ దేవి చాలా సంతోషిస్తుంది.

ఇంటి ఆవరణలో తులసి దగ్గర దీపం పెట్టాలి. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు.

(The above story first appeared on LatestLY on Nov 04, 2021 04:28 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).