Raw Chicken Crawling:ప్లేటులో నుంచి ఎగిరిపోయిన చికెన్ ముక్క, అది చూసి బెదిరిపోయిన జనాలు. ఇంటర్నెట్‌ను కుదిపేస్తున్న వైరల్ వీడియో, ఇది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్న జనాలు.
ఓ రెస్టారెంటులోని డైనింగ్ టేబుల్ మీద ప్లేటులో కొన్ని పచ్చి చికెన్ ముక్కలు ఉన్నాయి. అయితే అందులో నుంచి ఒక చికెన్ ముక్క పాకుకుంటూ పోయి ఆ టేబుల్ మీద నుంచి కిందకుదూకేసింది.
సాధారణంగా కోడిని కోసినప్పుడు అది ప్రాణాలు పోయేంతవరకు విలవిలలాడుతుంది. ఆ తర్వాత ఇక ఏమి ఉండదు, ముక్కలుముక్కలుగా కొట్టేసి దానిని చికెన్ 65 అని, చికెన్ మంచూరియా, చికెన్ ఫ్రై అంటూ వందల రకాలుగా దానిని వండేయడమే. అయితే అలా ముక్కలు ముక్కలుగా కొట్టిన తర్వాత కూడా అందులో నుంచి ఒక ముక్క (Raw Chicken) ప్రాణమున్నట్లే లేచి ప్లేటులో నుంచి ఎగిరి, టేబుల్ మీద నుంచి దూకడం ఎప్పుడైనా చూశారా? ఇది వినటానికి, ఊహించుకోవటానికే వింతగా ఉంది కదా? కానీ నిజంగానే అలాంటి వింత ఘటన ఒకటి జరిగిందంటే నమ్ముతారా? కావాలంటే ఈ వీడియో చూడండి.
ఫేస్‌బుక్‌లో రై ఫిలిప్స్ అనే ఓ మహిళ పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 2 లక్షలకు పైగా షేర్ చేశారు. ఆ వీడియోలో చూస్తే
ఒక రెస్టారెంట్‌లో డైనింగ్ టేబుల్ మీద కొన్ని రకాల ఆహార పదార్థాలతో పాటు ఒక ప్లేటులో కొన్ని పచ్చి చికెన్ ముక్కలు కూడా ఉన్నాయి.
అయితే అందులో నుంచి ఒక చికెన్ ముక్క పాకుకుంటూ పోయి ఆ టేబుల్ మీద నుంచి కిందకు పడిపోయింది. ఇది ఎక్కడ జరిగింది అనే విషయం తెయియదు కానీ, అక్కడ గమనిస్తే ప్లేట్‌లో తినేందుకు ఉపయోగించే 'చాప్ స్టిక్స్' ఉన్నాయి. దానిని బట్టి అది చైనా, కొరియా లేదా జపాన్ అయిఉండవచ్చు అని చెప్తున్నారు.
Chicken Crawling Viral Video:
ఈ వీడియో చూసిన చాలా మంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది ఇది ఎడిట్ చేసిన వీడియో అని కొట్టి పారేస్తుండగా, మరికొందరు ముక్కలుముక్క్కలుగా నరికినా సరే ఆ కోడికి బ్రతుకు మీద ఆశ చావలేదు అని, ఇంకొంత ఇదేదో భయంకరమైన 'జాంబిస్' (Zombie Chicken) కోడి అని కమెంట్స్ చేశారు. అలాగే ఇంకొంత మంది సైంటిఫిక్ రీజన్స్ చెప్పారు. కోడిని అప్పుడే కోసి ఉంటే దాని ముక్కల్లో కూడా కణాలు ఇంకా కొద్ది సేపు సజీవంగానే ఉంటాయి. ముక్కలకు ఉప్పు కలిపితే అందులోని కండరాలు సర్ధుబాటు కావడం వలన అందులో కదలిక వస్తుంది. దానివల్లే ఆ ముక్కలో కదిలిక వచ్చి పక్కకు జరిగిఉండవచ్చు అని చెప్పుకొచ్చారు.
(The above story first appeared on LatestLY on Sep 04, 2019 10:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

