Andhra Pradesh: ప్రేమ పేరుతో గర్భవతిని చేసి, పెళ్లి పేరు ఎత్తగానే, యువతిని దారుణంగా హతమార్చిన ప్రియుడు...
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఓ యువకుడు చేసిన నయవంచనకు ప్రియురాలు తన నిండు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆసల్యంగా వెలుగు చూసింది.
ప్రేమించిన ప్రియురాలిని గర్భవతిని చేసి తీరా పెళ్లి విషయానికి వచ్చేసరికి మాట దాటి, అంతేకాదు ఆమె ప్రాణాలను సైతం తీసిన ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో వెలుగు చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఓ యువకుడు చేసిన నయవంచనకు ప్రియురాలు తన నిండు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆసల్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే... చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని విజయనగరంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువతి కేసును పోలీసులు చేధించారు. బీహార్ రాష్ట్రంలోని గోపాల్ గంజ్ జిల్లా మధుసారియా అనే గ్రామానికి చెందిన రాజ్ దూత్(20) అదే గ్రామానికి చెందిన కవితకుమారి (22)తో ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలో ఇద్దరూ హద్దులు దాటేశారు. పెళ్లి చేసుకోవాలంటే పోషణ శక్తి కావాలి. అందుకే ముందుగా నాలుగు రాళ్ళు సంపాదించాలన్న ఉద్దేశంతో రాజ్ దూత్ చెన్నైకి వెళ్ళాడు. కొన్నాళ్లకు ప్రేయసి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. తాను గర్భం దాల్చానని.., సొంతూరుని నుంచి తీసుకెళ్లాలని చెప్పింది కవితకుమారి.
దీంతో రాజ్ దూత్.., బీహార్ లోని స్వగ్రామానికి వెళ్లి పెద్దలకు తెలియకుండా కవిత కుమారితో కలిసి చెన్నై వెళ్లాడు. ఆమెకు ఇంటర్లో మంచి మార్కులు రావడంతో చిత్తూరులోని ఓ కళాశాలలో బి ఫార్మసీ ఫ్రీ సీటు ఉందని... అక్కడకు వెళ్లి చదివించాలని లెక్చరర్ సలహా ఇచ్చాడు. తీరా కాలేజీకి వెళ్ళాక సీట్లు లేవని తేలడంతో వెనుతిరిగారు. అక్టోబర్ 11వ తేదీ చిత్తూరుకు వచ్చిన వీరిద్దరు. మొబైల్ రిపేర్ కోసం ఓ మొబైల్ షాపుకి వెళ్లి వచ్చిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అబార్షన్ చేయించుకొని ఇంటికి వెళదామని కవిత కుమారిని కోరాడు. అయితే అందుకు ఆమె ఒప్పుకోక పోవడంతో విజయపురం ఎస్టీ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు.
ఐతే కొన్నాళ్లు అబార్షన్ చేయించుకోవాలని కవిత కుమారిపై ఒత్తిడి తెచ్చిన రాజ్ దూత్... చివరకు ఆమెను అంతమొందించాలని స్కెచ్ వేశాడు. అనుకున్నట్లుగానే అక్టోబర్ 17వ నిద్రిస్తున్న సమయంలో కవిత కుమారి ముఖంపై దిండు అదిమిపెట్టి.. ఛాతీపై బలంగా మోదాడు. దీంతో కవిత కుమారి ఘటన స్థలంలోనే మృతి చెందింది. అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్న పోలీసులు. అద్దె గదిలో దొరికిన ఆనవాళ్లు ప్రకారం కేసు దర్యాప్తు చేపట్టారు నిందితుడైన రాజ్ దూత్ ని అదుపులోకి తీసుకోని రిమాండ్ కు తరలించారు.
(The above story first appeared on LatestLY on Nov 13, 2021 12:50 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

