కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో లేడి అఘోరి(Aghori) హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మం, హిందూ ధర్మం పేరుతో ఆలయాలను సందర్శిస్తూ నానా హంగామా చేస్తోంది. అయితే తాజాగా లేడి అఘోరికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఎందుకంటే మెడికల్ సర్టిఫికెట్ లో అబ్బాయి.. ఆధార్ కార్డులో అమ్మాయిగా అఘోరి(Aghori Aadhar card) పేరు ఉంది. దీంతో లేడీ అఘోరి ఆధార్ కార్డుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ట్రాన్స్ జెండర్ అయితే ఆధార్ కార్డులో అదే ఉండాలి కానీ ఫిమేల్ అని ఎందుకు ఉంది..?, ఒక పేరు మార్చాలి అంటేనే వందల ప్రూఫ్స్ అడిగే అధికారులు.. అఘోరీకి ఫిమేల్ అని ఎలా ఇచ్చారు..? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

హైదరాబాద్‌లో రెండు చోట్ల అగ్నిప్రమాదాలు, భారీగా ఆస్తి నష్టం, వీడియోలు ఇవిగో... 

అఘోరీ స్వస్థలం తెలంగాణలోని మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం. కొద్దిరోజుల క్రితం ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. అయితే 24 గంటలు గడవక ముందే తిరిగి ఆలయాల సందర్శన చేపట్టింది.

Boy in Medical Certificate, Girl in Aadhaar Card! 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)