Amaravathi, May 20: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం గురువారం ప్రారంభమైంది. ఏపి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. శాసన మండలిలో హోం మంత్రి మేకతోటి సుచరిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2021-22 రాష్ట్ర బడ్జెట్ అంచనా రూ.2,29,779.27 కోట్లు. ఇందులో రెవెన్యూ రూ. 1 లక్ష 82 వేల 196 కోట్లు ఉండగా, మూలధన వ్యయం - రూ. 47,582 కోట్లు, రెవెన్యూ లోటు - రూ. 5 వేల కోట్లు, ద్రవ్యలోటు రూ. 37,029.79 కోట్లు కాగా, జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు 3.49 శాతం మరియు రెవెన్యూ లోటు 0.47 శాతంగా పేర్కొన్నారు.
తొలిసారి లింగ ప్రాతిపదికన బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు పేర్కొన్న మంత్రి బుగ్గన, ఈ ఏడాది బడ్జెట్‌లో మహిళలకు మరియు చిన్నారులకు అధిక ప్రాధాన్యతను ఇచ్చినట్లు పేర్కొన్నారు. వీరి కోసం బడ్జెట్‌లో రూ. 47,283 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
2021-22 ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ కేటాయింపులు ఇలా ఉన్నాయి:
►బీసీ ఉప ప్రణాళిక: రూ.28,237 కోట్లు
►ఎస్సీ ఉప ప్రణాళిక: రూ.17,403 కోట్లు
►ఎస్టీ ఉప ప్రణాళిక: రూ.6,131 కోట్లు
►మైనార్టీ యాక్షన్ ప్లాన్: రూ.1,756 కోట్లు
►చిన్నారుల కోసం రూ.16,748 కోట్లు
►మహిళల అభివృద్ధి: రూ.47,283.21 కోట్లు
►వ్యవసాయ పథకాలు: రూ.11,210 కోట్లు
►విద్యా పథకాలు: రూ.24,624 కోట్లు
►వైద్యం, ఆరోగ్యం: రూ.13,830 కోట్లు
►వైఎస్‌ఆర్ బీమాకు రూ.372.12 కోట్లు
►అర్చకుల ఇన్సెంటివ్‌లకు రూ.120 కోట్లు
►ఇమామ్, మౌజాంల ఇన్సెంటివ్‌లకు రూ.80 కోట్లు
►పాస్టర్ల ఇన్సెంటివ్‌లకు రూ.40 కోట్లు
►వైఎస్సార్-పీఎం ఫసల్ బీమా: రూ.1802 కోట్లు
►డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులు: రూ.865 కోట్లు
►పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలు: రూ.247
►వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణకు రూ.1,556.39 కోట్లు
►వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్‌కు రూ.243.61 కోట్లు
►దిశ కోసం రూ.33.75 కోట్లు
►అంగన్వాడీల్లో నాడ-నేడు కార్యక్రమాలకు రూ.278 కోట్లు
►వైఎస్సార్ పింఛన్ కానుక: రూ.17 వేల కోట్లు
►వైఎస్సార్ రైతు భరోసా: రూ.3,845 కోట్లు
►జగనన్న విద్యా దీవెన: రూ.2,500 కోట్లు
►జగనన్న వసతి దీవెన: రూ.2,223.15 కోట్లు
►వైఎస్సార్ నేతన్న నేస్తం: రూ.190 కోట్లు
►వైఎస్సార్ మత్స్యకార భరోసా: రూ.120 కోట్లు
►మత్స్యకారులకు డీజిల్ రాయితీ: రూ.50 కోట్లు
►అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు: రూ.200 కోట్లు
►రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులు: రూ.500 కోట్లు
►వైఎస్సార్ కాపు నేస్తం: రూ.500 కోట్లు
►వైఎస్సార్ జగనన్న చేదోడు: రూ.300 కోట్లు
►వైఎస్సార్ వాహన మిత్ర: రూ.285 కోట్లు
►వైఎస్సార్ ఆసరా: రూ.6,337 కోట్లు
►అమ్మఒడి: రూ.6,107 కోట్లు
►వైఎస్సార్ చేయూత: రూ.4,455 కోట్లు
►రైతు పథకాలు: రూ.11,210.80 కోట్లు
►రైతులకు నష్ట పరిహారం: రూ.20 కోట్లు
►లా నేస్తం: రూ.16.64 కోట్లు
►ఈబీసీ నేస్తం: రూ.500 కోట్లు
►విద్యా రంగానికి రూ.24,624.22 కోట్లు
►స్కూళ్లలో నాడు-నేడుకు రూ.3,500 కోట్లు
►జగనన్న గోరుముద్ద కోసం రూ.1200 కోట్లు
►జగనన్న విద్యాకానుకు కోసం రూ.750 కోట్లు
►ఉన్నత విద్య కోసం రూ.1973 కోట్లు
►వైఎస్‌ఆర్ టెస్టింగ్ ల్యాబ్‌లకు రూ.85.57 కోట్లు
►వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమాకు రూ.1802.82 కోట్లు
►వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు రూ.739.46 కోట్లు
►వైఎస్‌ఆర్ పశువుల నష్టపరిహారానికి రూ.50 కోట్లు
►ఆరోగ్య రంగానికి రూ.13,840.44 కోట్లు
►ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోలుకు రూ.2,248.94 కోట్లు
►ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమానికి రూ.1535 కోట్లు
►కోవిడ్‌పై పోరాటానికి రూ.1000 కోట్లు
►ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో శానిటేషన్‌కు రూ.100 కోట్లు
►శ్రీకాకుళం జిల్లా పలాస ఆస్పత్రికి రూ.50 కోట్లు
►హౌసింగ్, మౌలిక వసతులకు రూ.5,661 కోట్లు
►పరిశ్రమలకు ఇన్సెంటివ్‌ల కోసం రూ.1000 కోట్లు
►ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్‌కు రూ.200 కోట్లు
►కడప స్టీల్ ప్లాంట్ కోసం రూ.250 కోట్లు
►ఏపీఐఐసీకి రూ.200 కోట్లు కేటాయింపు
►ఎంఎస్‌ఎంఈలో మౌలిక వసతులకు రూ.60.93 కోట్లు
►పారిశ్రామిక మౌలిక సదుపాయాలకు రూ.3,673.34 కోట్లు
►రోడ్లు భవనాల శాఖకు రూ.7,594.6 కోట్లు
►ఎనర్జీ రంగానికి రూ.6,637 కోట్లు
►ల్యాండ్ రీసర్వే కోసం రూ.206.97 కోట్లు
►పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖకు రూ.8,727 కోట్లు
►నీటిపారుదల శాఖకు రూ.13,237.78 కోట్లు.
కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని గురువారం ఒక్కరోజే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ ఒక్కరోజులోనే బడ్జెట్‌పై చర్చ జరిపై మరియు ఆమోదం తెలుపుతారు. ఇక జగన్ సర్కార్ 'అప్రజాస్వామిక పాలన'ను నిరసిస్తూ ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ప్రకటించింది.