COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 10,080 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 2,17,040కు చేరిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 1900 దాటిన కరోనా మరణాలు

కర్నూలు జిల్లా నుంచి అత్యధికంగా 1353 కేసులు నమోదయ్యాయి. అలాగే తూర్పు గోదావరి జిల్లా నుంచి దాదాపు అంతేస్థాయిలో 1310 కేసులు నమోదయ్యాయి. ఇక విశాఖపట్నం, చిత్తూరు, అనంతపూర్...

COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 10,080 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 2,17,040కు చేరిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 1900 దాటిన కరోనా మరణాలు
coronavirus in idnia (Photo-PTI)

Amaravati, August 8: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి అంతకంతకూ విస్తరిస్తూ పోతోంది. ప్రతిరోజు రాష్ట్రం నుంచి వేల సంఖ్యలో కొవిడ్ బాధితులు పెరుగుతూ పోతున్నారు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 10,080 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 2,17,040 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 2,14,145 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా,  కర్నూలు జిల్లా నుంచి అత్యధికంగా 1353  కేసులు నమోదయ్యాయి. అలాగే తూర్పు గోదావరి జిల్లా నుంచి దాదాపు అంతేస్థాయిలో

1310 కేసులు నమోదయ్యాయి. ఇక విశాఖపట్నం, చిత్తూరు, అనంతపూర్ జిల్లాల నుంచి కూడా సుమారు వెయ్యికి దగ్గరగా కొత్త కేసులు వచ్చాయి.

గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా మరో 97 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 1939 కు పెరిగింది.

AP's COVID19 Report:

Status of positive cases of #COVID19 in Andhra Pradesh

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 9,151 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 1,29,615 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 85,486 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గడిచిన ఒక్కరోజులో  62,123 మంది శాంపుల్స్   పరీక్షించినట్లు తెలిపింది.  ఈరోజు వరకు సుమారుగా 24,24,393 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

(The above story first appeared on LatestLY on Aug 08, 2020 06:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).