AP's COVID Update: కొవిడ్19 నుంచి కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్, కొత్తగా నమోదయ్యే కేసుల కంటే రికవరీలే ఎక్కువ; గడిచిన ఒక్కరోజులో 7,553 కేసులు నమోదు
న్నటి నుండి ఈరోజు వరకు మరో 10,555 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 5,62,376 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో....
Amaravati, September 22: ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. గతంలో ప్రతిరోజు 10 వేలకు తక్కువ కాకుండా నమోదయ్యే పరిస్థితుల నుంచి క్రమక్రమంగా మెరుగుపడుతోంది. మరోవైపు రికవరీలు పెరుగుతూపోవడం శుభపరిణామంగా చెప్పవచ్చు, ఈ క్రమంలో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గుతూపోవటం ఊరట కలిగించే విషయం. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 7,553 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 6,39,302కు చేరింది.
అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 6,36,407మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
ఉభయ గోదావరి జిల్లాల్లో కరోనావైరస్ తీవ్రత కొనసాగుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో కరోనావైరస్ వ్యాప్తిలో ఎలాంటి నియంత్రణ కనిపించడం లేదు. గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచే అత్యధికంగా 1166 కేసులు నమోదయ్యాయి.
ఇటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా 989 పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం. మరోవైపు చిత్తూరు జిల్లా నుంచి 902 కేసులు నివేదించబడ్డాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID Update:

గడిచిన ఒక్కరోజులో మరో 51 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 5,461కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 10,555 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 5,62,376 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 71,465 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
గడిచిన ఒక్కరోజులో 68,829 మంది శాంపుల్స్ పరీక్షించినట్లు తెలిపింది. ఈరోజు వరకు రాష్ట్రంలో 52,29,529 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
(The above story first appeared on LatestLY on Sep 22, 2020 07:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

