AP's COVID Update: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 8,096 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 6,09,558కు చేరిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 5244కు పెరిగిన కరోనా మరణాలు

నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 11,803 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 5,19,891 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 84,423 ఆక్టివ్ కేసులు ఉన్నాయని....

AP's COVID Update: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 8,096 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 6,09,558కు చేరిన మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య, 5244కు పెరిగిన కరోనా మరణాలు
Coronavirus in AP (Photo Credits: PTI)

Amaravati, September 18: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ కొవిడ్ తీవ్రత కొనసాగుతుంది, పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయితే అదే స్థాయిలో రికవరీలు కూడా ఉండటం కొంత ఊరట కలిగించే విషయం, దీంతో కొవిడ్ కేసులు పెరుగుతున్నా, యాక్టివ్ కేసుల సంఖ్య మాత్రం స్థిరంగా అలాగే ఉంటోంది.

గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 8,096  పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 6,09,558కు చేరింది.

అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 6,06,663మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఉభయ గోదావరి జిల్లాల్లో కరోనావైరస్ తీవ్రత కొనసాగుతోంది.  తూర్పు గోదావరి జిల్లాలో  కరోనావైరస్ వ్యాప్తిలో ఎలాంటి నియంత్రణ కనిపించడం లేదు.  గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచే అత్యధికంగా 1405 కేసులు నమోదయ్యాయి.

ఇటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా 1035 పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం.  మరోవైపు చిత్తూరు జిల్లా నుంచి 902 కేసులు నివేదించబడ్డాయి.   జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID Update:

Status of positive cases of #COVID19 in Andhra Pradesh

గడిచిన ఒక్కరోజులో  మరో 69 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 5,244కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 11,803 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇలా ఇప్పటివరకు 5,19,891 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 84,423 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గడిచిన ఒక్కరోజులో  77,710 మంది శాంపుల్స్   పరీక్షించినట్లు తెలిపింది.  ఈరోజు వరకు రాష్ట్రంలో  49,59,081 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

(The above story first appeared on LatestLY on Sep 18, 2020 06:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).