Kurnool Road Accident: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారీని కారు ఢీకొని ప్రమాదంలో ముగ్గురు మృతి,
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కర్నూలు జిల్లా ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
కర్నూలు, ఫిబ్రవరి 11 : కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కర్నూలు జిల్లా ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ధర్మవరానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు కర్నూలు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆస్పత్రిలో ఉన్న తమ బంధువులను చూసేందుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
భారత్‌లో కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మార్కెట్ విక్రయానికి అనుమతి
ఈ ప్రమాదంలో ఆదిలక్ష్మి, శ్రీనివాసులు, భాగ్యలక్ష్మి మృతి చెందారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధిక వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
(The above story first appeared on LatestLY on Feb 11, 2022 11:39 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

