Pilli Subhash Chandra Bose On Party Change: వైసీపీని వీడను, జగన్‌కు వెన్నుపోటు పొడవను క్లారిటీ ఇచ్చిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసీపీలోనే ఉంటానని స్పష్టం

వైసీపీకి ,ఎంపీ పదవులకు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ త్వరలో టీడీపీలో చేరనుండగా తాజాగా మరో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం రాజీనామా చేస్తారని వార్తలు వెలువడుతున్నాయి.

Pilli Subhash Chandra Bose On Party Change: వైసీపీని వీడను, జగన్‌కు వెన్నుపోటు పొడవను క్లారిటీ ఇచ్చిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసీపీలోనే ఉంటానని స్పష్టం
Pilli Subhash Chandra Bose Clarity On Party Change, i am all ways with jagan says chandrabose

Vij, Aug 30:   వైసీపీకి ,ఎంపీ పదవులకు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ త్వరలో టీడీపీలో చేరనుండగా తాజాగా మరో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం రాజీనామా చేస్తారని వార్తలు వెలువడుతున్నాయి.

ఈ నేపథ్యంలో స్పందించారు పిల్లి సుభాష్ చంద్రబోస్. వైసీపీని వీడనని, జగన్‌కు వెన్నుపోటు పొడవలేనని తెలిపారు సుభాష్. తనకు రాజకీయ విలువలు ఉన్నాయని, వైసీపీలోనే కొనసాగుతానని చెప్పారు. కలలో కూడా పార్టీ మారే ఆలోచన తనకు లేదన్నారు.  టీడీపీలోకి మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు..పార్టీ మారినోళ్ళు పరువు పొగొట్టుకున్నారంటూ అంబటి రాంబాబు ఫైర్

జగన్ నాయకత్వంలోనే పని చేస్తానని మరోసారి మీడియా ముందు తెలిపారు. నిజానిజాలు తెలియకుండా తప్పుడు రాతలు రాయవద్దని కోరారు. తనకు నైతిక విలువలు ఉన్నాయని, ఆ విలువలను కాపాడే విధంగా పత్రికలు వార్తలు ప్రచురించాలని తెలిపారు. తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఎవరూ చేయవద్దన్నారు.

(The above story first appeared on LatestLY on Aug 30, 2024 11:58 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).