Harishrao: శాతగానోనికి మాటలెక్కువ..సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్, రేవంత్ నోట.. బూతులు తప్ప నీతులు రాలేదు అని మండిపాటు
వరంగల్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. శాతగానోనికి మాటలెక్కువ, చేవలేనోనికి బూతులెక్కువ అన్నట్లు ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి ఉందని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. నువ్వు ఎంత గింజుకున్నా లాభం లేదు. అశోక్ నగర్ నుంచి లగచర్ల దాకా, రైతుల నుండి లంబాడి బిడ్డల దాకా నువ్వు చేసిన ఘోరాలు సమసిపోవు. తెలంగాణ ప్రజలు మరిచిపోరు అన్నారు.
Hyd, Nov 20: వరంగల్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. శాతగానోనికి మాటలెక్కువ, చేవలేనోనికి బూతులెక్కువ అన్నట్లు ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి ఉందని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
నువ్వు ఎంత గింజుకున్నా లాభం లేదు. అశోక్ నగర్ నుంచి లగచర్ల దాకా, రైతుల నుండి లంబాడి బిడ్డల దాకా నువ్వు చేసిన ఘోరాలు సమసిపోవు. తెలంగాణ ప్రజలు మరిచిపోరు అన్నారు. రేవంత్ రెడ్డి..! నువ్వు కేసీఆర్.. కేసీఆర్.. అంటూ కేసీఆర్ నామస్మరణ చేసినంత మాత్రాన నీ పాపం పోదు. కేసీఆర్ వంటి గొప్ప వ్యక్తి జీవితంలో అర్థం కాడు అన్నారు.
పదకొండు నెలల పాలనలో ఆయన నోటి నుండి బూతులు తప్ప నీతులు రాలేదు..కాంగ్రెస్ విజయోత్సవ సభ అని పేరు పెట్టుకొని చేసింది ఏమీ లేక, చెప్పుకోవడానికి ఏమీ లేక ఎప్పటి లాగే పిచ్చి మాటలు వదిలిండు అన్నారు.నీ వదురుబోతు తనంతో రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు. నీ దుర్భాషను ప్రజల విచక్షణకే వదిలేస్తున్నాం అన్నారు. తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చానని గప్పాలు కొడుతున్నవు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నాయకులను తొక్కినవు. షార్ట్ కట్ లో అధికారం చేజిక్కించుకొని ప్రజలను తొక్కుతున్నవు అని మండిపడ్డారు.
ప్రజా తిరుగుబాటుకు ఇది ఆరంభం అన్నారు హరీశ్ రావు. గెలిస్తే ప్రజాపాలన తెస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రజలను అణచివేసే పాలన సాగిస్తోంది. ఏడాది పాలనను పూర్తిచేసుకుంటూ సంబరాలకు సిద్ధమవుతున్న ప్రభుత్వానికి లగచర్లలో ఎదురైన ప్రజా నిరసన ఒక తిరుగుబాటేనన్నారు. వీడియో ఇదిగో, తెలంగాణలో తిరిగే కేసీఆర్ అనే మొక్కను పెరగనీయను, కాస్కో ఇక చూసుకుందామంటూ సీఎం రేవంత్‌రెడ్డి సవాల్
Here's Tweet:
ప్రజా తిరుగుబాటుకు ఇది ఆరంభం.
గెలిస్తే ప్రజాపాలన తెస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రజలను అణచివేసే పాలన సాగిస్తోంది. ఏడాది పాలనను పూర్తిచేసుకుంటూ సంబరాలకు సిద్ధమవుతున్న ప్రభుత్వానికి లగచర్లలో ఎదురైన ప్రజా నిరసన ఒక తిరుగుబాటే!
కాంగ్రెస్ ఇందిరమ్మ పాలన అందిస్తుందని… pic.twitter.com/HSzNxMHIRd
— Office of Harish Rao (@HarishRaoOffice) November 20, 2024
కాంగ్రెస్ ఇందిరమ్మ పాలన అందిస్తుందని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజంగానే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలనను తెచ్చింది. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఒక ప్రైవేటు ఫార్మా కంపెనీకి భూములు ఇప్పించడానికి ప్రజలపై ఉక్కుపాదం మోపుతుందా? స్త్రీలను తొక్కుకుంటూ ఇండ్లలోకి చొరబడి అరెస్టు చేసిన ప్రభుత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజలకు అండగా గొంతెత్తుతున్న ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం, జైల్లో పెడతామని బెదిరించడం ప్రజాస్వామ్య ప్రభుత్వం చేసే పనేనా? అని ప్రశ్నించారు.
Here's Tweet:
 
శాతగానోనికి మాటలెక్కువ,
చేవలేనోనికి బూతులెక్కువ
అన్నట్లు ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి.
పదకొండు నెలల పాలనలో ఆయన నోటి
నుండి బూతులు తప్ప నీతులు రాలేదు.
కాంగ్రెస్ విజయోత్సవ సభ అని పేరు పెట్టుకొని చేసింది ఏమీ లేక, చెప్పుకోవడానికి ఏమీ లేక ఎప్పటి లాగే పిచ్చి మాటలు వదిలిండు.
ఇక…
— Harish Rao Thanneeru (@BRSHarish) November 19, 2024
(The above story first appeared on LatestLY on Nov 20, 2024 08:58 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

