Congress Vs KCR: కేసీఆర్.. మేం వెయిటింగ్ ఇక్కడ.. గులాబీ బాస్‌కు కాంగ్రెస్ నేతల కౌంటర్, ఇప్పటికైనా ప్రజల్లోకి రావాలని డిమాండ్ చేసిన హస్తం పార్టీ నేతలు
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్(KCR) ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నేతలు(Congress Vs KCR).
Hyd, January 31: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్(KCR) ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నేతలు(Congress Vs KCR). కేసీఆర్.. మేం వెయిటింగ్ ఇక్కడ అంటూ మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్.
పార్టీని, కార్యకర్తలను కాపాడుకునేందుకు వాళ్లను వీళ్లను కేసీఆర్ బతిమిలాడుకుంటున్నారు. తెలంగాణ సమాజానికి ద్రోహం చేసి భారతీయ జనతా పార్టీ(BJP) ముసుగులో.. భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. ఆయన ఏం చేస్తారో అని మేము వెయిట్ చేస్తున్నాం. తెలంగాణ ప్రజలు వారిని భరించడానికి సిద్ధంగా లేరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీచమైన రాజకీయాల గురించి కవిత మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కేరళలో కవిత లిక్కర్ స్కామ్(Kerala Liquor Scam) బాగోతం బయటపడిందని... ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికే సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కల్వకుంట్ల కుటుంబానికి కొత్తేమీ కాదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక అంతకముందు జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్(KCR)... కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని... ఇన్ని రోజులు నేను మౌనంగా ఉన్న గంభీరంగా చూస్తున్న.. నేను కొడితే మామూలుగా ఉండదు అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజల సంతోషంగా లేరు... మళ్లీ కరెంటు కోతలు, మంచినీటి సమస్యలు మొదలయ్యాయన్నారు. నేను కొడితే మామూలుగా ఉండదు.. గంభీరంగా చూస్తున్న, కార్యకర్తలతో కేసీఆర్, ప్రాణం పోయినా తెలంగాణ కోసం కోట్లాడుదాం అని పిలుపు
పాలనా వైఫల్యాలను నిలదీస్తే కేసులు పెడుతున్నారు... కాంగ్రెస్ వాళ్లు దొరికితే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారు అన్నారు. రైతుబంధుకి రామ్ రామ్.. దళిత బంధుకి జై భీమ్ అని ఆనాడే చెప్పాను.. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్కు ఓటేశారు అన్నారు. కాంగ్రెస్ ముస్లింలను ఓట్ల కోసం వాడుకుంటుందన్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ మనోడే.. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే ఉన్నాయి ఎండ బెడుతున్నారు అన్నారు. సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల టెండర్లు ఎందుకు పిలవలేదు... కాంగ్రెస్ పాలనపై అంతట అసంతృప్తి, అన్ని వర్గాలను కాంగ్రెస్ ముంచిందన్నారు. ప్రస్తుతం పథకాలన్నీ గంగలో కలిశాయి, కరోనా టైంలో కూడా రైతుబంధు ఆపలేదు అన్నారు.
(The above story first appeared on LatestLY on Jan 31, 2025 04:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

