Tummala Nageshwarrao: ఈ ఖరీఫ్‌ సీజన్‌కు రైతు భరోసా లేదు, ప్రతీ రైతుకు రూ.500 బోనస్‌ ఇస్తాం, కాంగ్రెస్ హామీలన్ని నెరవేరుస్తామన్న మంత్రి తుమ్మల

ఈ ఖరీఫ్‌కు రైతు భరోసా లేదు అని తేల్చి చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.సన్న ధాన్యం పండించిన ప్రతి రైతుకు ₹500 లు బోనస్ ఇస్తాం...పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వం అన్నారు. పంట వేయని భూములకు ₹25 వేల కోట్లు గత ప్రభుత్వం ఇచ్చింది...రైతు భరోసా 7500 క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఇస్తాం అన్నారు.

Tummala Nageshwarrao: ఈ ఖరీఫ్‌ సీజన్‌కు రైతు భరోసా లేదు, ప్రతీ రైతుకు రూ.500 బోనస్‌ ఇస్తాం, కాంగ్రెస్ హామీలన్ని నెరవేరుస్తామన్న మంత్రి తుమ్మల
Tummala Nageswara Rao Key Comments On Rythu Bharosa (video grab)

Hyd, Oct 19: ఈ ఖరీఫ్‌కు రైతు భరోసా లేదు అని తేల్చి చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.సన్న ధాన్యం పండించిన ప్రతి రైతుకు ₹500 లు బోనస్ ఇస్తాం...పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వం అన్నారు. పంట వేయని భూములకు ₹25 వేల కోట్లు గత ప్రభుత్వం ఇచ్చింది...రైతు భరోసా 7500 క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఇస్తాం అన్నారు.

మార్పులకు అనుగుణంగా రైతులను మారుస్తాం...ఆర్థిక వెసులుబాటు లేకపోయినా ముఖ్యమంత్రి రుణమాఫీ అంశాన్ని తన భుజాన వేసుకున్నారు.గతంలో వైఎస్సార్ హయాంలో 70 వేల కోట్ల రుణమాఫీ చేశారు అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం..42 బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకుని రుణమాఫీ చేశామన్నారు..

రాష్ట్రంలో 42 లక్షల లబ్ధిదారులకు, 25 లక్షల కుటుంబాలకు 31 వేల కోట్లు అవసరం అన్నారు.18 వేల కోట్ల రూపాయల రుణమాఫీ ఆగస్టు 15 వ తేదీనే చేశాం...20 లక్షల మందికి ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉందన్నారు.₹2 లక్షల పైన ఉన్న డబ్బులు కడితే రుణమాఫీ అవుతుందన్నారు.

తెల్ల రేషన్ కార్డు లేని 3 లక్షల మందికి డిసెంబర్లో కుటుంబ నిర్ధారణ చేసి రుణమాఫీ చేస్తాం. ₹2500కోట్లు వేస్తాం..రుణ విముక్తి కావాలంటే కొత్త రుణాలు రావు అన్నారు. ₹2 లక్షల పైన ఉన్న రుణాల వారి అంశం క్యాబినెట్లో చర్చిస్తాం...పంటల భీమా గతంలో లేదు. ఇప్పుడు రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.ప్రతీ రైతు పంటకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది...రాష్ట్రంలో పండే అన్ని పంటలను ఎంఎస్పీ ప్రకారమే కొనుగోలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన అన్ని పంటలను కేంద్రం కొనుగోలు చేయాలి. ఇప్పటి వరకు 20% కేంద్రం కొనుగోలు చేస్తుందన్నారు. కీసరగుట్టలో మహిళా అఘోరి, ఒంటి కాలిపై నిలబడి శివుడికి ప్రత్యేక పూజలు, తీర్థ ప్రసాదాలు అందజేసిన అర్చకులు 

వ్యవసాయ రంగం, రైతుల విషయంలో కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు అమలు చేస్తాం అన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణాలు మాఫీ చేశారు...దేశంలో ఇప్పటి వరకు ₹2 లక్షల రైతు రుణమాఫీ ఎక్కడా జరగలేదు అన్నారు. రైతు కమిషన్ వేశారు. రాబోయే రెండేళ్లలో అనేక మార్పులు తీసుకువస్తాం...రాష్ట్రంలో ఒక కొత్త శకం స్టార్ట్ అయ్యిందన్నారు.

(The above story first appeared on LatestLY on Oct 19, 2024 06:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).