Vande Bharat Passenger Looted: సికింద్రాబాద్ స్టేషన్ లో ఘోరం, వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికురాలిని కొట్టి బంగారం, వజ్రభరణాలు దోచుకెళ్లిన దుండగులు..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శనివారం ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి గుర్తుతెలియని వ్యక్తులు బంగారు, వజ్రాభరణాలను దోచుకెళ్లారు. ఘటన జరిగినప్పుడు మహిళ తిరుపతి వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేరంలో పాత నేరస్తుడి పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

Vande Bharat Passenger Looted: సికింద్రాబాద్ స్టేషన్ లో ఘోరం, వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికురాలిని కొట్టి బంగారం, వజ్రభరణాలు దోచుకెళ్లిన దుండగులు..
Representational Image (Photo Credits: Pexels)

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శనివారం ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి గుర్తుతెలియని వ్యక్తులు బంగారు, వజ్రాభరణాలను దోచుకెళ్లారు. ఘటన జరిగినప్పుడు మహిళ తిరుపతి వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాల్సి ఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేరంలో పాత నేరస్తుడి పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని ద్వారాలు ఉండాలి, 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధిత మహిళ పేరు స్రవంతి, ఆమె  టీఎస్ సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తున్నారు. గుండ్లపోచంపల్లి నివాసిగా గుర్తించారు.  ఆమె గేట్ నంబర్ 4 ద్వారా స్టేషన్‌లోకి ప్రవేశించి వందేభారత్ రైలు ఎక్కేందుకు ముందుకు సాగుతోంది. నిందితులు ఆమెను వెనుక నుంచి కొట్టి  చెయిన్ స్నాచింగ్ చేసి పారిపోయారు. ఆమె గుర్తించే లోపే, ప్రయాణికుల గుంపులో అనుమానితులు అదృశ్యమయ్యారు.

(The above story first appeared on LatestLY on Jun 17, 2023 01:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).