Khammam Crime: బాబాయితో శృంగారం చేస్తూ భర్తకు అడ్డంగా దొరికిపోయింది, నిలదీసినందుకు కట్టుకున్న భర్తను రోకలిబండతో దారుణంగా కొట్టి చంపిన మహిళ..
కట్టుకున్న భర్తను కాదని.. వివాహేతర సంబంధాలపై మోజు పెంచుకుంటున్నారు. వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను హతమార్చిందో భార్య. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది.
ఖమ్మం, మార్చి 6: కట్టుకున్న భర్తను కాదని.. వివాహేతర సంబంధాలపై మోజు పెంచుకుంటున్నారు. వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను హతమార్చిందో భార్య. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. సదరు మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. వైరా సీఐ సంపత్ కుమార్ చెప్పిన వివరాల మేరకు.. ఫిబ్రవరి 6న కుర్నవల్లి లో జయరాం అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.
జయరాం భార్యే భర్తను రోకలిబండతో కొట్టి చంపినట్లుగా అంగీకరించింది. భర్త రోజూ తాగి వచ్చి తనను కొట్టడం, వేధిస్తుండటంతో హత్య చేసినట్లుగా పోలీసులకు తెలిపింది. ఆమె చెప్పిన విషయాలను బట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు.. విస్తుపోయే నిజాలు తెలిశాయి. జయరాం భార్యకు వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఫిబ్రవరి 26న జయరాం మద్యం సేవించి ఇంటికి వచ్చేసరికి భార్య, ఆమె బాబాయ్ ఇద్దరూ కలిసి ఉండటాన్ని చూశాడు. కోపంతో భార్యతో గొడవ పడ్డాడు.
ఈ క్రమంలో ఆమె బాబాయ్ జయరాంను తన్నడంతో కిందపడిపోయాడు. ఆ వెంటనే ఆమె పక్కనే ఉన్న రోకలిబండ తీసుకుని భర్త తలపై కొట్టింది. జయరాం స్పృహ తప్పి పడిపోగా.. ఆ తర్వాత భర్త నోటిలో దుప్పటి కుక్కి ఊపిరాడకుండా చేసింది. జయరాం మరణించాడు. విచారణలో ఈ విషయాలన్నీ వెల్లడవ్వగా.. జయరాం భార్య, ఆమె బాబాయ్ ను మధిర కోర్టులో హాజరు పరిచి, రిమాండ్ కు తరలించారు పోలీసులు.
(The above story first appeared on LatestLY on Mar 06, 2022 01:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

