ఇంగ్లాండ్ కు చెందిన ఓ వ్యాపారవేత్త సెక్స్ వర్కర్ తో ఛాట్ చేసినందుకు ఆయన భార్య విడాకుల దావా వేసింది. అయితే విచిత్రంగా దీనికి కారణం ఆపిల్ కంపెనఅ అంటూ ఆ భర్త కోర్టు గడపతొక్కాడు. తనకు భార్య దూరమవడమే కాక ఆర్థికంగా కూడా నష్టం వాటిల్లుతోందని, దీనికి అంతటికీ కారణం యాపిల్ కంపెనీయేనంటూ కోర్టుకెక్కాడు. ఏకంగా 5 మిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ దావా వేశాడు.
విసయంలోకి వెళితే.. ఇంగ్లాండ్ వ్యాపారవేత్త తన ఇంట్లోని ఐమ్యాక్ తో ఓ సెక్స్ వర్కర్ తో ఆన్ లైన్ ఛాటింగ్ చేశాడు. ఆమెతో పనయ్యాక ఆ మెసేజ్ లు అన్నీ డిలీట్ చేశాడు. భార్యకు తెలిసే అవకాశం లేనందున హాయిగా ఉన్నాడు. అయితే ఈ విషయం భార్యకు తెలిసింది. ఎలాగంటే.. యాపిల్ కంపెనీ ఉత్పత్తుల్లో ఐమెసేజెస్ కు ఓ సౌలభ్యం ఉంది. ఒకే యాపిల్ ఐడీతో ఉపయోగిస్తున్న ఐఫోన్, ఐమాక్ లలో ఏదైనా ఒక ఫోన్ లేదా మ్యాక్ లో డిలీట్ చేసిన మెసేజ్ లు మరో ఫోన్ లేదా మ్యాక్ లో చూడొచ్చు. సింక్రనైజేషన్ ప్రక్రియ వల్ల ఇది సాధ్యపడుతుంది. పురుషుడి వృషణాల్లోనే కాదు.. వీర్యంలోనూ మైక్రో ప్లాస్టిక్ గుర్తింపు.. శుక్ర కణాల కదలికలను అడ్డుకొంటున్న ప్లాస్టిక్.. పురుష సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం.. పరిశోధించిన అన్ని శాంపిల్స్ లోనూ పాజిటివ్.. చైనా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
దీంతో భర్త ఐడీని వాడుతున్న భార్య తన ఫోన్ లో డిలీట్ ఛాటింగ్ చూసి మండిపడింది. విడాకులు కావాలంటూ కోర్టులో దావా వేసి, ఈ మెసేజ్ లను సాక్ష్యంగా అందజేసింది. విడాకులు మంజూరైతే భరణం కింద 5 మిలియన్ డాలర్లు భార్యకు చెల్లించాల్సి వస్తుందని, ఇటు భార్య దూరమై అటు ఆర్థికంగా కూడా నష్టపోయే పరిస్థితి ఎదురైందని భర్త లబోదిబోమన్నాడు.
ఐమెసేజ్ లు డిలీట్ చేసినపుడు ‘యువర్ మెసేజెస్ ఆర్ డిలీటెడ్’ అని సందేశం వచ్చిందని, దాంతో తాను భరోసాగా ఉన్నానని చెప్పాడు. అలా కాకుండా ‘యువర్ మెసేజెస్ డిలీటెడ్ ఆన్ దిస్ డివైజ్’ అనో లేక ‘యువర్ మెసేజెస్ డిలీటెడ్ ఆన్ దిస్ డివైజ్ ఓన్లీ’ అనో సందేశం కనిపిస్తే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదన్నారు.దీనంతటికీ కారణం యాపిల్ కంపెనీయేనని ఆరోపించాడు.
సెక్స్ వర్కర్ తో తన చాటింగ్ విషయాన్ని భార్య మూడ్ బాగున్నపుడు తానే చెప్పేవాడినని అన్నాడు. అయినా సరే తమ మధ్య గొడవ జరిగే అవకాశం ఉందని ఒప్పుకున్నాడు. అయితే, పరిస్థితి విడాకుల దాకా మాత్రం వచ్చేది కాదన్నాడు. తన ద్వారా తెలియాల్సిన విషయం యాపిల్ కంపెనీ నిర్వాకం వల్ల తెలిసేసరికి తన భార్య బాగా హర్టయిందని చెప్పాడు. తనకు జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యత యాపిల్ కంపెనీదేనని స్పష్టం చేశాడు. తనలాంటి పరిస్థితి ఎదుర్కొన్న యాపిల్ వినియోగదారులు కూడా ముందుకు వచ్చి న్యాయపోరాటం చేయాలని పిలుపునిచ్చాడు.