KTM RC- Adventure Series: మరింత ఆకర్షణీయమైన కలర్ వేరియంట్‌లలో కేటీఎం బైక్‌లు విడుదల, వీటి ధరలు ఎలా ఉన్నాయి, కొత్తగా ఏం మారాయి? తెలుసుకోండి!
KTM RC- Adventure Series : Pic- Official website

KTM RC- Adventure Series: స్పోర్ట్ బైక్‌ల తయారీదారు KTM భారతదేశంలో తమ మార్కెట్ వాటాను మరింత పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంది. యువతను ఆకర్షించడం కోసం తమ బ్రాండ్‌లోని  2024 KTM RC మరియు KTM అడ్వెంచర్ సిరీస్ కోసం సరికొత్త కలర్ వేరియంట్‌లను విడుదల చేసింది. RC మరియు అడ్వెంచర్ సిరీస్‌లోని ప్రతి మోడల్ బైక్ ఇప్పుడు రెండు కొత్త కలర్ వేరియంట్‌లతో అప్‌డేట్ అయ్యాయి. అయితే, హార్డ్‌వేర్ పరంగా లేదా యాంత్రికంగా ఈ బైక్ లలో ఎలాంటి మార్పులు చేయలేదు. అంతేకాకుండా ఈ కొత్త బైక్ వేరియంట్‌ల ధరలు కూడా ఏమీ మారలేదు. గతంలో ఉన్న ధరలకే ఇప్పుడు కొత్త షేడ్స్‌లో వివిధ బైక్ మోడళ్లను కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ కొత్త వేరియంట్ బైక్ లలో కొత్తదనం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

2024 KTM RC రేంజ్ కొత్త కలర్ స్కీమ్

2024 KTM RC శ్రేణిలోని RC 125, RC 200 మరియు RC 390లతో సహా అన్ని మోడళ్లు ఇప్పుడు సరికొత్త రంగుల్లో లభిస్తున్నాయి.

2024 KTM RC 125 బైక్ ఇప్పుడు రెండు డ్యూయల్-టోన్ పెయింట్ ఆప్షన్ లో కూడా లభించనుంది. ఇది నీలం- నారింజ, మరియు నలుపు - నీలం వంటి రెండు కలర్ కాంబినేషన్‌లలో లభిస్తుంది.

2024 KTM RC 200 ఇప్పుడు రెండు కొత్త కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ఒకటి బ్లాక్- ఆరెంజ్ హైలైట్‌లతో, మరొకటి నేవీ బ్లూలో ఆరెంజ్ యాక్సెంట్‌లతో లభిస్తుంది.

ఇక, 2024 KTM RC 390 కూడా ఇప్పుడు రెండు కొత్త రంగులలో వస్తుంది. బ్లాక్- ఆరెంజ్ కలర్ కాంబినేషన్‌తో పాటు ప్రకాశవంతమైన ఆరెంజ్ అల్లాయ్ వీల్స్ తో వస్తుంది.

2024 KTM 250 అడ్వెంచర్ లైనప్ కూడా ఇప్పుడు రెండు కొత్త డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లను కలిగి ఉంది: లూనార్ గ్రే - ఆరెంజ్ మరియు బ్లూ అండ్ వైట్ అనే రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుంది.

KTM RC- Adventure Series ధరలు

ఎక్స్-షోరూమ్ వద్ద ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలించండి.

KTM RC 125 ధర: రూ. 1,89,542

KTM RC 200 ధర: రూ. 2,17,696

KTM RC 390 ధర: రూ. 3,18,173

KTM 390 అడ్వెంచర్ ధర: రూ. 3,38,746

KTM 250 అడ్వెంచర్ ధర: రూ. 2,46,651

ఆస్ట్రియన్ బైక్ మేకర్ KTM  తమ బ్రాండ్ నుంచి విడుదల చేసిన 2024 మోడల్‌లలో దేని ధరలను పెంచలేదు. కొత్తగా విడుదల చేసిన మోటార్ సైకిళ్ల శ్రేణికి సంబంధించిన బుకింగ్‌లు ఇప్పటికే అన్ని షోరూమ్‌లలో ప్రారంభమయ్యాయి, డెలివరీలు కొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.