దేశీయ మార్కెట్లోకి మరో స్కూటర్ ఫ్యాసినో ఎస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది యమహా మోటర్. యూరోపియన్ డిజైన్, పనితీరు, నయా లుక్‌తో తీర్చిదిద్దిన ఈ ఫ్యాసినో ఎస్ మోడల్ యువతను దృష్టిలో పెట్టుకొని తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. రెండు రకాల్లో లభించనున్న ఈ స్కూటర్ ధర రూ.93,730, రూ.94,530గా నిర్ణయించింది. త్వరపడండి, మారుతి నెక్సా కార్లపై రూ. 70 వేల వరకు తగ్గింపు, ఏయే కార్ల రేట్లు తగ్గాయంటే..
అయితే ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. బీఎస్-6 ప్రమాణాలకు లోబడి ఈ స్కూటర్‌ను తయారు చేసినట్లు, ముఖ్యంగా 125 సీసీ ఇంజిన్‌తో తయారైన ఈ మోడల్ స్మార్ట్ మోటర్ జనరేటర్(ఎస్ఎంజీ), సైలెంట్ స్టార్ట్, ఎయిర్-కూల్డ్, పనితీరు అధికంగా ఉంటుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. మొబైల్ యాప్‌లో యాక్టివేట్ అయినప్పుడు, స్కూటర్ దాదాపు రెండు సెకన్ల పాటు హారన్ సౌండ్‌తో పాటు ఎడమ, కుడి సూచికలను ఎంగేజ్ చేయడం ద్వారా ప్రతిస్పందిస్తుంది, ఇది స్కూటర్‌ను గుర్తించడంలో వినియోగదారుకు ఇది సహాయపడుతుంది.