Mahindra Group Invest Row: ఆటో సెక్టార్‌లో రూ. 37 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న మహీంద్రా గ్రూప్, 23 కొత్త వాహనాలు విడుదల చేయబోతున్నట్లు ప్రకటన

దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్‌ మహీంద్రా భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. వచ్చే మూడేండ్లకాలంలో రూ.37 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. వచ్చే మూడేళ్లలో దేశీయ మార్కెట్లోకి 23 నూతన వాహనాలను విడుదల చేయబోతున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో అనిశ్‌ షా తెలిపారు.

Mahindra Group Invest Row: ఆటో సెక్టార్‌లో రూ. 37 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న మహీంద్రా గ్రూప్, 23 కొత్త వాహనాలు విడుదల చేయబోతున్నట్లు ప్రకటన
Anand-Mahindra

Mahindra Group to invest Rs 37,000 crore in auto sector:  దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్‌ మహీంద్రా భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. వచ్చే మూడేండ్లకాలంలో రూ.37 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. వచ్చే మూడేళ్లలో దేశీయ మార్కెట్లోకి 23 నూతన వాహనాలను విడుదల చేయబోతున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో అనిశ్‌ షా తెలిపారు. మహీంద్రా ఎక్స్ యూవీ 3ఎక్స్ఓ వచ్చేసింది, ధర రూ.7.49 లక్షల నుంచి ప్రారంభం, మే 15 నుంచి కొత్త కారు బుకింగ్స్..

విడుదల చేయనున్న వాహనాల్లో తొమ్మిది ఇంటర్నల్‌ కంబ్యుస్టాన్‌ ఇంజిన్‌(ఐసీఈ) ఎస్‌యూవీ, ఏడు బ్యాటరీతో నడిచే వాహనాలు, ఏడు లైట్‌ కమర్షియల్‌ వాహనాలను 2030 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. తొమ్మిది ఐసీఈ ఎస్‌యూవీల్లో నూతన బ్రాండ్‌తో ఆరు మాడళ్లు కాగా, మూడు పాత బ్రాండ్లను మళ్లీ ప్రవేశపెట్టబోతున్నది. ఈ తాజా పెట్టుబడుల్లో ఆటో డివిజన్‌ కోసం రూ.27 వేల కోట్లు, ఐసీఈ వర్టికల్‌ కోసం రూ.14 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నది. ఈ నిధులతోనే దేశవ్యాప్తంగా ఉన్న ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచుకోనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం సంస్థ వద్ద 2.2 లక్షల వాహనాల పెండింగ్‌ ఆర్డర్లు ఉన్నాయని, వీటి కోసం ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు ఆయన చెప్పారు. మహీంద్రా XUV 3XO సంచలనం, 60 నిమిషాల్లో 50,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు నమోదు

మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో  రూ.2,754 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.2,637 కోట్లతో పోలిస్తే ఇది 4% ఎక్కువ. ఆదాయం రూ.32,456 కోట్ల నుంచి 9% పెరిగి రూ.35,452 కోట్లకు చేరింది.2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.11,269 కోట్లకు చేరింది. 2022-23 నాటి రూ.9,025 కోట్లతో పోలిస్తే, ఇది 25% అధికం. ఆదాయం     రూ.1,21,362 కోట్ల నుంచి 15% పెరిగి రూ.1,39,078 కోట్లకు చేరింది. ఇక రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.21.10 (422%) చొప్పున డివిడెండ్‌ చెల్లించేందుకు బోర్డు ప్రతిపాదించింది.

(The above story first appeared on LatestLY on May 17, 2024 01:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).