Maruti Suzuki Fronx: మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారుకు స్పెషల్ ఎడిషన్ విడుదల, ఫ్రాంక్స్ టర్బో వెలాసిటీ ఎడిషన్ పేరుతో లాంచ్ అయిన ఈ కారులో ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసుకోండి!
Maruti Suzuki Fronx Turbo Velocity Edition: ప్రముఖ కార్ మేకర్ మారుతి సుజుకి తాజాగా 'టర్బో వెలాసిటీ ఎడిషన్' పేరుతో తమ బ్రాండ్ ఫ్రాంక్స్ కారులో ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేసింది. ఫ్రాంక్స్ టర్బో వెలాసిటీ ఎడిషన్ మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. అవి డెల్టా+, జీటా మరియు ఆల్ఫా. అయితే ఈ స్పెషల్ ఎడిషన్ కారును కొనుగోలు చేయడానికి వినియోగదారులు అదనంగా రూ. 43,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అందుకు తగినట్లుగా ఈ కొత్త ఎడిషన్ కారులో ఇంటీరియర్, ఎక్ట్సీరియర్ కోసం సరికొత్త హంగులను అందిపుచ్చుకుంది.
మారుతి సుజుకి ప్యాకేజీలో భాగంగా డోర్ వైజర్లు, బంపర్ గార్నిష్, ORVM కవర్లు, సీట్ కవర్లు, ఇంటీరియర్ కోసం కార్బన్ ఫినిషింగ్ ఇన్సర్ట్‌లు, బూట్ మ్యాట్‌లు సహా మొత్తం 16 బాహ్య మరియు అంతర్గత ఉపకరణాలను అందిస్తోంది. 16 యాక్సెసరీల మొత్తం ప్యాకేజీ కోసం ధర రూ.43,000 పెరిగింది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఇంజన్ సామర్థ్యం
మారుతి సుజుకి యొక్క Fronx మోడల్ కారు రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. వీటిలో ఒకటి 89bhp వద్ద 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.2-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కాగా, మరొకటి 99bhp వద్ద 148Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. ఈ రెండు వేరియంట్లలో గేర్‌బాక్స్ ఎంపికలలో మాన్యువల్, AMT, ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ ఉన్నాయి.
ఈ కార్ నెక్సా బ్లూ, ఆర్కిటిక్ వైట్, ఆర్కిటిక్ వైట్, స్ల్పెండిడ్ సిల్వర్, గ్రాండియర్ గ్రే, ఎర్తెన్ బ్రౌన్, ఓప్యులెంట్ రెడ్ వంటి విభిన్నమైన రంగు ఆప్షన్లలో లభిస్తుంది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ స్పెషల్ ఎడిషన్ ధరలు ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 7.94 నుంచి ప్రారంభమవుతాయి, టాప్-ఎండ్ వెర్షన్ రూ. 13.47 వరకు ధర ఉంటుంది.
ఇదిలా ఉంటే, కొత్త ఎడిషన్ విడుదలతో పాత ఎడిషన్లపై రూ.83000 వరకు వివిధ రాయితీలను, ఎక్స్చేంజ్ ఆఫర్లను కంపెనీ అందిస్తోంది.
(The above story first appeared on LatestLY on Feb 06, 2024 04:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

