Toyota Glanza: త్వరపడండి రూ.6.68 లక్షల ధరకే టయోటా గ్లాన్జా స్పెషల్ ఎడిషన్ కారు, ఫీచరు, ఇతర వివరాలు ఇవిగో..

ప్రముఖ కార్ల దిగ్గజం టయోటా.. గ్లాన్జా స్పెషల్ ఎడిషన్ కారును భారత్ మార్కెట్లలో ఆవిష్కరించింది. అయితే లిమిటెడ్ యూనిట్లు మాత్రమే తీసుకొస్తోంది. రూ.20,567 విలువైన కాంప్లిమెంటరీ విడి భాగాలతో ఈ నెలాఖరు వరకూ బుక్ చేసుకున్న వారికి కార్లు డెలివరీ చేస్తుంది.

Toyota Glanza: త్వరపడండి రూ.6.68 లక్షల ధరకే టయోటా గ్లాన్జా స్పెషల్ ఎడిషన్ కారు, ఫీచరు, ఇతర వివరాలు ఇవిగో..
Toyota Glanza festive edition

ప్రముఖ కార్ల దిగ్గజం టయోటా.. గ్లాన్జా స్పెషల్ ఎడిషన్ కారును భారత్ మార్కెట్లలో ఆవిష్కరించింది. అయితే లిమిటెడ్ యూనిట్లు మాత్రమే తీసుకొస్తోంది. రూ.20,567 విలువైన కాంప్లిమెంటరీ విడి భాగాలతో  ఈ నెలాఖరు వరకూ బుక్ చేసుకున్న వారికి కార్లు డెలివరీ చేస్తుంది. ప్రస్తుత ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో ఈ నెల ప్రారంభంలో టయోటా తన అర్బన్ క్రూయిజర్ హై రైడర్, టైసార్ ఫెస్టివ్ ఎడిషన్ కార్లను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

మారుతి సుజుకి బాలెనో రీబ్రాండెడ్ వర్షన్ ‘టయోటా గ్లాన్జా’ దేశంలోనే అతితక్కువ ధరకు లభిస్తున్న కారు. ఈ కారు ధర రూ.6.68 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.9.99 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు పలుకుతుంది. టయోటా గ్లాన్జా ఫెస్టివ్ ఎడిషన్ క్రోమ్ అండ్ బ్లాక్ బాడీ సైడ్ మౌల్డింగ్స్, రేర్ రిఫ్లెక్టర్, విస్తరించిన ఫెండర్‌తోపాటు రేర్ డోర్ అండ్ ఓఆర్వీఎంస్ కోసం క్రోమ్ ఇన్‌సర్ట్స్, ప్రత్యేకంగా 3డీ ఫ్లోర్ మ్యాట్స్, డోర్ విజర్స్, బ్లాక్ అండ్ సిల్వర్ రంగుల్లో నెక్ కుషన్స్, వెల్ కం డోర్ ల్యాంప్ తదితర ఫీచర్లు ఉంటాయి.

వచ్చే 12 నెలల్లో లాంచ్‌కు సిద్దమవుతున్న నాలుగు కొత్త SUV కార్లు, పూర్తి వివరాలు ఇవిగో..

టయోటా గ్లాన్జా ఫెస్టివ్ ఎడిషన్ కారు 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ విత్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ అండ్ ఏఎంటీ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లతో వస్తోంది. కొనుగోలు దారులు ఐదు కలర్ ఆప్షన్లతోపాటు ఈ,ఎస్,జీ, వీ ట్రిమ్స్ ఎంచుకోవచ్చు.

(The above story first appeared on LatestLY on Oct 20, 2024 06:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).