2000 Note Exchange Deadline: రూ.2 వేల నోటు మార్పిడికి నేడే ఆఖరు.. నేటితో ఆర్బీఐ ఇచ్చిన గడువు పూర్తి.. రేపటి నుంచీ రూ.2 వేల నోట్లు చెల్లవా? పూర్తి వివరాలు ఇదిగో..
ఏడేండ్ల కిందట తీసుకొచ్చిన రెండు వేల రూపాయల నోటును ఆర్బీఐ ఉపసంహరించుకున్నట్టు గతంలోనే ప్రకటించింది. సెప్టెంబర్ 30 లోపు ప్రజలు తమ వద్ద ఉన్న రెండు వేల నోట్లను బ్యాంకుల్లో జమ చేయాలని గడువు విధించింది.
Hyderabad, Sep 30: ఏడేండ్ల కిందట తీసుకొచ్చిన రెండు వేల రూపాయల నోటును ఆర్బీఐ (RBI) ఉపసంహరించుకున్నట్టు గతంలోనే ప్రకటించింది. సెప్టెంబర్ 30 లోపు ప్రజలు తమ వద్ద ఉన్న రెండు వేల నోట్లను బ్యాంకుల్లో (Banks) జమ చేయాలని గడువు (Deadline) విధించింది. నేటితో ఆ గడువు పూర్తి కానుంది. మరి రేపటి నుంచీ రూ.2 వేల నోటు చెల్లదా? అనే సందేహం మనలో చాలా మందికి కలిగే ఉంటుంది. అయితే, ఆర్బీఐ గతంలోనే ఈ ప్రశ్నకు సవివరమైన సమాధానం ఇచ్చింది.
Last Date To Exchange ₹ 2,000 Note Is September 30, Clarifies RBI https://t.co/AoGcMd1o0R pic.twitter.com/Cs6ksdhst1
— NDTV (@ndtv) September 29, 2023
ఆర్బీఐ ఏమన్నది?
సెప్టెంబర్ 30లోపు ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లను బ్యాంకుల్లో జమ చేయాలని మే 16న ఆర్బీఐ ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచీ ఈ నోటుతో ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. అయితే, నోటు మాత్రం యథావిధిగా లీగల్ టెండర్‌గా కొనసాగుతుంది. అంటే.. ప్రజలు అక్టోబర్ 1 నుంచీ ఈ నోటును కేవలం ఆర్బీఐ శాఖల్లో మాత్రమే మార్చుకోగలరు. మునుపటి వలే బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం లేదా బ్యాంకుల్లోనే ఇతర నోట్లుగా మార్చుకోవడం మాత్రం కుదరదు. అయితే, అక్టోబర్ నుంచీ ఆర్బీఐ శాఖల్లో ఈ నోట్లు మార్చుకునే వారు పాత డెడ్‌లైన్ ఎందుకు మిస్సయ్యారో చెప్పాల్సి ఉంటుంది.
(The above story first appeared on LatestLY on Sep 30, 2023 08:44 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

