New E-Commerce Rules: డిస్కౌంట్ చూసి వెంటనే కొనొద్దు.. ఆన్‌లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్.. కొనేముందు ఈ 7 విషయాలు తప్పక చెక్ చేయండి..

ఆన్‌లైన్ షాపింగ్ చేసే కోట్ల మంది వినియోగదారుల హక్కులను పరిరక్షించడమే కాకుండా, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

New E-Commerce Rules: డిస్కౌంట్ చూసి వెంటనే కొనొద్దు.. ఆన్‌లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్.. కొనేముందు ఈ 7 విషయాలు తప్పక చెక్ చేయండి..
New E-Commerce Rules

New E-Commerce Rules: ఆన్‌లైన్ షాపింగ్ చేసే కోట్ల మంది వినియోగదారుల హక్కులను పరిరక్షించడమే కాకుండా, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 'వినియోగదారుల రక్షణ (ఈ-కామర్స్) (సవరణ) నిబంధనలు-2026' పేరుతో సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నూతన నిబంధనలు 2027 జనవరి 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. నలభై దాటితే ఉద్యోగం పోయినట్లే.. కార్పోరేట్ ఉద్యోగ మార్కెట్‌లో పెరుగుతున్న ఆందోళన.. కారణం ఏంటంటే..

నూతన నిబంధనల ప్రకారం ఉత్పత్తుల ధరల నిర్ణయం, సెర్చ్ ర్యాంకింగ్స్, స్పాన్సర్డ్ జాబితాలు, వినియోగదారులను తప్పుదోవ పట్టించే 'డార్క్ ప్యాటర్న్స్' నిషేధం, ఫిర్యాదుల త్వరిత పరిష్కారం వంటి కీలక అంశాలపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఈ నిబంధనలు కొనుగోలుదారులకు మరింత అదనపు భద్రతను కల్పిస్తున్నప్పటికీ, డిజిటల్ షాపింగ్ సమయంలో వినియోగదారులు కూడా పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని సైబర్ భద్రతా నిపుణులు సూచిస్తున్నారు.

షాపింగ్ చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు:

ఈ-కామర్స్ సైట్లలో కేవలం ఆకర్షణీయమైన వస్తువుల ఫోటోలు, రేటింగ్స్ చూసి మోసపోకుండా ప్రతి అమ్మకందారుడు (సెల్లర్) తన వ్యాపార చిరునామా, కస్టమర్ కేర్ సమాచారాన్ని స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు పేమెంట్ పేజీ యూఆర్‌ఎల్ (URL) మరియు గుర్తింపు పొందిన గేట్‌వేలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. బ్యాంకింగ్ ఓటీపీ, పిన్, పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోకూడదు.

ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో సెర్చ్‌ ఫలితాలలో పైన కనిపించే 'స్పాన్సర్డ్' లేదా 'ప్రకటన'ల ఉత్పత్తులను కేవలం వ్యాపార ప్రచారంగానే పరిగణించాలి తప్ప, వాటిని అత్యుత్తమ నాణ్యత కలవిగా భావించవద్దు. అలాగే అనుకోకుండా అదనపు రుసుములు, సబ్‌స్క్రిప్షన్లు జోడించే డార్క్ ప్యాటర్న్‌ల పట్ల జాగ్రత్త వహించాలి. కొనుగోలుకు అవసరమైన సమాచారాన్ని మాత్రమే అందిస్తూ, అనవసర వ్యక్తిగత డేటాను పంచుకోకుండా ఉండటం సురక్షితం.

భవిష్యత్తులో ఏదైనా వివాదం తలెత్తితే వినియోగదారులు ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఆర్డర్ ఇన్‌వాయిస్‌లు, ఈ-మెయిల్స్ మరియు పేమెంట్ రసీదులను భద్రపరుచుకోవాలి. నూతన నిబంధనల ప్రకారం ఫిర్యాదు అందిన 48 గంటల్లోగా గ్రీవెన్స్ ఆఫీసర్ స్పందించి, రికార్డును అందించడం నిర్బంధం చేశారు. ప్రభుత్వ చట్టాలతో పాటు వినియోగదారుల వ్యక్తిగత జాగ్రత్తలు మాత్రమే డిజిటల్ షాపింగ్‌ను సురక్షితంగా మార్చగలవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Sep 24, 2026 04:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).