Vijay Mallya Case: విజయ్ మాల్యా రుణాల ఎగవేత కేసులో బిగ్ ట్విస్ట్.. రూ.10,270 కోట్లు రికవరీ చేసినా ఇంకా రూ.8,751 కోట్లు బకాయి ఉందన్న ఎస్‌బీఐ..
Vijay Mallya Case: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వ్యవస్థాపకుడు విజయ్ మాల్యాకు సంబంధించిన బ్యాంకు బకాయిల వ్యవహారంలో బొంబాయి హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం మాల్యా నుంచి ఇంకా భారీ మొత్తంలో బకాయిలు రాబట్టాల్సి ఉందని కోర్టుకు స్పష్టం చేసింది.
Vijay Mallya Case: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వ్యవస్థాపకుడు విజయ్ మాల్యాకు సంబంధించిన బ్యాంకు బకాయిల వ్యవహారంలో బొంబాయి హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం మాల్యా నుంచి ఇంకా భారీ మొత్తంలో బకాయిలు రాబట్టాల్సి ఉందని కోర్టుకు స్పష్టం చేసింది. ఇప్పటివరకు రూ.10,270 కోట్లను రికవరీ చేసినప్పటికీ, 2026 ఆగస్టు 31 నాటికి ఇంకా రూ.8,751.86 కోట్లు బకాయిగా ఉన్నాయని తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది.
తమపై ఉన్న అసలు బకాయిల కంటే ఎక్కువ మొత్తమే బ్యాంకులు రికవరీ చేశాయని, అందువల్ల బకాయిల వివాదం ముగిసినట్లేనని మాల్యా కోర్టులో వాదించారు. ఈ ప్రాతిపదికన తనపై కొనసాగుతున్న క్రిమినల్ కేసులను కొట్టివేయాలని కోరుతూ 2020లో బొంబాయి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా బ్యాంకులు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించాయి. డాలర్ దెబ్బకు రూపాయి మళ్లీ 99కు పతనం.. సంచలన అంచనాను విడుదల చేసిన కోటక్ సెక్యూరిటీస్.. కారణమేమిటంటే..
డెట్ రికవరీ ఆఫీసర్ ద్వారా రికవరీ చేసిన రూ.10,270 కోట్లతో పాటు, డెట్ రికవరీ ట్రిబ్యునల్‌లో కేసు దాఖలు చేయడానికి ముందే మరో రూ.544.58 కోట్లు రాబట్టినట్లు బ్యాంకులు తెలిపాయి. అయితే వడ్డీలు, న్యాయపరమైన ఖర్చులు పెరగడంతో బకాయిలు ఇంకా మిగిలే ఉన్నాయని వివరించాయి. 2026 జనవరి నాటికి రూ.8,135.63 కోట్లుగా ఉన్న బకాయిలు, వడ్డీలు తోడవడంతో ఆగస్టు 31 నాటికి రూ.8,751.86 కోట్లకు చేరాయని తెలిపాయి. దీనికితోడు మాల్యాకు చెందిన కొన్ని అటాచ్డ్ షేర్లు ఇంకా విక్రయించాల్సి ఉందన్నాయి.
మరోవైపు, ఆస్తుల రికవరీ జరిగినంత మాత్రాన మనీలాండరింగ్‌కు సంబంధించిన క్రిమినల్ కేసులు స్వయంచాలకంగా ముగిసిపోవని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) హైకోర్టుకు తెలిపింది. 2019లోనే ఫ్యూజిటివ్ ఎకనామిక్ ఆఫెండర్‌గా ప్రకటించబడిన మాల్యాపై సీబీఐ, ఈడీ విచారణలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో తదుపరి విచారణను బొంబాయి హైకోర్టు అక్టోబర్ 13, 2026కు వాయిదా వేసింది.
(The above story first appeared on LatestLY on Oct 03, 2026 12:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

