Zomato Layoffs: హైదరాబాద్ ఆఫీసును మూసివేస్తున్నట్లు ప్రకటించిన జొమాటో.. 250 మంది ఉద్యోగులను తొలగించిన ఫుడ్ డెలివరీ దిగ్గజం..

ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో (Zomato) హైదరాబాద్‌లోని తన కస్టమర్ సపోర్ట్ కార్యకలాపాలను పూర్తిగా మూసివేసింది. కంపెనీ చేపట్టిన అంతర్గత పునర్నిర్మాణ వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోగా.. దాదాపు 250 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు.

Zomato Layoffs: హైదరాబాద్ ఆఫీసును మూసివేస్తున్నట్లు ప్రకటించిన జొమాటో.. 250 మంది ఉద్యోగులను తొలగించిన ఫుడ్ డెలివరీ దిగ్గజం..
Zomato (Photo Credits: Wikimedia Commons)

Zomato Layoffs: ప్రముఖ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో (Zomato) హైదరాబాద్‌లోని తన కస్టమర్ సపోర్ట్ కార్యకలాపాలను పూర్తిగా మూసివేసింది. కంపెనీ చేపట్టిన అంతర్గత పునర్నిర్మాణ వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోగా.. దాదాపు 250 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు.

ఆరు నెలల ఆపరేటింగ్ మోడల్ సమీక్ష అనంతరం కస్టమర్ కేర్ బాధ్యతలను థర్డ్-పార్టీ వెండర్లకు, ఆటోమేషన్ వ్యవస్థలకు అప్పగించాలని జొమాటో నిర్ణయించింది. మిగిలిన అంతర్గత సపోర్ట్ బృందాలను గురుగ్రామ్‌లోని ప్రధాన కార్యాలయానికి తరలించి, అక్కడి సాంకేతిక, బిజినెస్ విభాగాలతో అనుసంధానించనున్నారు.

ప్రభావిత ఉద్యోగులకు నాలుగు నెలల పరిహారం: ఉద్యోగాలు కోల్పోయిన సిబ్బందికి జొమాటో యాజమాన్యం ఊరటనిచ్చే ప్యాకేజీని ప్రకటించింది. ఆగస్టు జీతంతో పాటు, కాంట్రాక్ట్ నోటీసు వేతనం మరియు ఎక్స్-గ్రేషియాతో కలిపి మొత్తం నాలుగు నెలల పరిహారాన్ని చెల్లించనున్నారు. ఉద్యోగులకు వైద్య బీమా (Medical Insurance) మరియు కౌన్సెలింగ్ మద్దతును మార్చి 31, 2027 వరకు వర్తింపజేయనున్నారు.

రైలు టికెట్ బుక్ చేస్తున్నారా.. IRCTC వెబ్‌సైట్, యాప్‌లలో డార్క్ ప్యాటర్న్‌ల కలకలం.. లోకల్‌సర్కిల్స్ సర్వేలో షాకింగ్ నిజాలు!

కాంపాక్ట్ సైజ్‌లో జొమాటో 'టెంపుల్ వేరబుల్' పరికరం: మరోవైపు, జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ తమ సంస్థ అభివృద్ధి చేస్తున్న ‘టెంపుల్ వేరబుల్’ పరికరంపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ వేరబుల్ పరికరం హార్డ్‌వేర్ సైజ్‌ను మునుపటి కంటే సగానికి పైగా తగ్గించామని, ఇది మార్కెట్‌లోనే అత్యంత కాంపాక్ట్ పరికరంగా నిలుస్తుందని తెలిపారు. ఈ లిమిటెడ్ ఎడిషన్ పరికరం ప్రీ-ఆర్డర్లు త్వరలోనే ప్రారంభమవుతాయని, 2026 చివరి నాటికి డెలివరీలు (Shipments) ప్రారంభిస్తామని గోయల్ స్పష్టం చేశారు.

(The above story first appeared on LatestLY on Aug 31, 2026 01:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).