దీప్తీ సునైనా ఈ అమ్మడి గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియా సెన్సేషన్ గా అడుగుపెట్టిన ఈ అమ్మడు, బిగ్ బాస్ తెలుగు సెకండ్ సీజన్లో తన ముద్దు ముద్దు మాటలతో అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ అమ్మడు తన అందంతోనూ, కవర్ సాంగ్స్ లో డ్యాన్స్ తోనూ అదరగొడుతూ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. దీప్తి సునైనా ఒకవైపు చదువుకుంటూనే..మరోవైపు మోడలింగ్ చేస్తుంటుంది. మరోవైపు సినిమాలపై ఉన్న ఇష్టంతో చాలా షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. ఇక అది అలా ఉంటే దీప్తి సునైనా, మరో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌తో లవ్‌లో పడిన సంగతి యూత్ అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరులో చాలా కవర్ వీడియో సాంగ్స్‌లోను కలిసి నటించి అలరించారు.
షణ్ముఖ్ జస్వంత్ కూడా దీప్తీ పేరును తన ఒంటిపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అలాగే దీప్తీ కూడా షన్ను పేరును పచ్చబొట్టు లాగా పొడిపించుకుంది. అంతగా ప్రేమించుకున్న దీప్తి, తన ప్రియుడు షన్ను నుంచి విడిపోయినట్లు.. ఇద్దరికి బ్రేక్ అప్ అయ్యినట్లు సోషల్ మీడియా కోడై కూస్తుంది. ప్రస్తుతం షణ్ముఖ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో టాప్ కంటెస్టెంట్స్‌లో ఒకడిగా రాణిస్తున్నారు. అక్కడ అందరి మధ్య కలిసి తిరుగుతూ రకరకాల టాస్క్‌లు ఆడుతూ అదరగొడుతున్నారు. ఇదంతా బాగున్నా.. ఇటీవల ప్రసారం అయిన ఓ ఎపిసోడ్లో మరో కంటెస్టెంట్ సిరి షన్నును ముద్దు పెట్టింది. ఆ ముద్దే షన్ను, దీప్తి మధ్య అగాథం పెంచిందనే వార్తలు వస్తున్నాయి.
ఈ ముద్దు గురించి బిగ్ బాస్ హౌజ్‌లో కూడా కొంత చర్చ జరిగింది. తాజాగా జరిగిన దీపావళి ఎపిసోడ్లో కూడా గెస్ట్‌గా వచ్చిన ముక్కు అవినాష్ ఇదే సీన్‌ను చేసి అందరిని నవ్వించారు. ఇక ఈ ముద్దే దీప్తి, షన్నులు విడిపోవడానికి కారణం అయ్యిందని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.
దీనికి కారణం లేకపోలేదు. దీప్తి సునైనా సైతం ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షన్నును అన్ ఫాలో చేసింది. షన్నును అన్ ఫాలో చేయడానికి కారణం సిరి ముద్దే అని అంటున్నారు నెటిజన్స్. ఈ ముద్దు కారణంగానే దీప్తి ఫీల్ అయ్యిందని.. దీంతో బ్రేక్ అప్ చెప్పిందని అంటున్నారు.