Allu Arjun: అల్లు అర్జున్ తన పుట్టిన ఊరు పాలకొల్లు కోసం ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు, చేతులెత్తి దండం పెడుతున్న జనం...
పుష్ప సినిమాతో భారీ హిట్ అందుకున్న అల్లు అర్జున్ తను పుట్టిన ఊరు పాలకొల్లు గుడి నిర్మాణానికి 20 లక్షలు డొనేట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. పాలకొల్లు లో పుట్టిన అల్లు అర్జున్ అక్కడ శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి గుడి కొరకు 20 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు.
పుష్ప సినిమాతో భారీ హిట్ అందుకున్న అల్లు అర్జున్ తను పుట్టిన ఊరు పాలకొల్లు గుడి నిర్మాణానికి 20 లక్షలు డొనేట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. పాలకొల్లు లో పుట్టిన అల్లు అర్జున్ అక్కడ శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి గుడి కొరకు 20 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఆ డబ్బుతో గుడివారు గోశాల, రథశాల, వహనశాల కూడా నిర్మించారు. రామలింగేశ్వర స్వామి రథాన్ని కూడా చేయించారు. సంక్రాంతి పండగకు ముందే ఈ గుడి రెనోవేషన్ పూర్తయింది. పరమశివుడి పంచారామ క్షేత్రాలలో ఈ గుడి కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఇదిలా ఉంటే జీవితంలో ఒక ఎత్తుకెదిగిన తర్వాత చాలామంది తాము పుట్టి పెరిగిన ఊరు గురించి మర్చిపోతుంటారు. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం పుట్టిన ఊరు, ఇచ్చిన మాటని మరిచి పోయే రకం కాదు. తాజాగా ఈ విషయాన్ని మరొక సారి నిరూపించుకున్నారు.
(The above story first appeared on LatestLY on Jan 18, 2022 10:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

