Allu Arjun Fans Fire On Hyper Aadi: హైపర్ ఆదిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్, అయినా తగ్గేదేలే అంటున్న హైపర్ ఆది, అసలు ఏం జరిగింది..
కామెడీ స్కిట్ అంటూ పుష్ప పేరడీ చేయడం ద్వారా అల్లు అర్జున్ ను అవమానించడం అంటూ విమర్శలు చేస్తూ కొందరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఈ వారంలో ఆ స్కిట్ ను కనుక టెలికాస్ట్ చేస్తే తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు.
జబర్దస్త్ షో తగ్గేదేలే అన్నట్లుగా ఈ పదేళ్లుగా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. జబర్దస్త్ కామెడీ షో సూపర్ హిట్ అవ్వడం లో కీలక పాత్ర పోషించింది స్పూఫ్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని వందల సినిమాలను కామెడీ చేసి చూపించారు. తాజాగా హైపర్ ఆది పుష్ప సినిమాకు సంబంధించిన స్కిట్ చేశాడు. ఈ వారంలో ఆ స్కిట్ ను టెలికాస్ట్ చేయబోతున్నారు. ఈ వారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను ఇప్పటికే విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పుష్ప సినిమా ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్న కారణంగా ఈ స్కిట్ ను కూడా చూస్తూ జనాలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పుష్ప స్కిట్ అద్బుతంగా వచ్చిందని ప్రోమో చూస్తుంటేనే అనిపిస్తుంది. హైపర్ ఆది ఏం చేసినా కూడా కచ్చితంగా అద్బుతంగా నవ్వించే విధంగా ఉంటుందని రోజా మరియు మనో లు అంటూనే ఉంటారు. ఇప్పుడు ఈ స్కిట్ కూడా ఖచ్చితంగా అదే తరహా లో వచ్చిందని అనిపిస్తుంది. కాని కొందరు దీనిపై విమర్శలు చేయడం చర్చనీయాంశం అవుతోంది.అల్లు అర్జున్ పుష్ప సినిమా సూపర్ డూపర్ హిట్.. అలాంటి సినిమా ఇంకా థియేటర్ ల్లో ఉంది.
ఈ సమయంలో కామెడీ స్కిట్ అంటూ పుష్ప పేరడీ చేయడం ద్వారా అల్లు అర్జున్ ను అవమానించడం అంటూ విమర్శలు చేస్తూ కొందరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఈ వారంలో ఆ స్కిట్ ను కనుక టెలికాస్ట్ చేస్తే తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు. పెద్ద ఎత్తున పుష్ప సినిమాకు సంబంధించిన వసూళ్లు నమోదు అవుతున్న సమయంలో బూతుల కామెడీ షో లో పుష్ప ను చూపించడం అంటే మా పుష్ప ను అవమానించడమే అంటూ వారు వాదిస్తున్నారు. మరి దీనికి హైపర్ ఆది ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూడాలి.
(The above story first appeared on LatestLY on Jan 19, 2022 02:37 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

