Allu Arjun To PS: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నేడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్.. ఏం జరుగనున్నది??
సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో ప్రముఖ హీరో అల్లు అర్జున్ ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ముందు హాజరుకానున్నారు.
Hyderabad, Dec 24: సంధ్య థియేటర్ లో (Sandhya Theatre) జరిగిన తొక్కిసలాట (Stampede) కేసులో ప్రముఖ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసుల ముందు హాజరుకానున్నారు. రానున్నారు. ఉదయం 11 గంటలకు విచారణకు రావాలంటూ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన స్టేషన్ కు రానున్నట్టు సమాచారం. అయితే ఈ నోటిసులపై తన లీగల్ టీమ్ తో అల్లు అర్జున్ సోమవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. విచారణ సమయంలో పోలీసులు అడగబోయే ప్రశ్నలపై ఎలా స్పందించాలనే విషయంపై అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తున్నది.
భయంలో అభిమానులు
హైకోర్టు మధ్యంతర బెయిల్ పై ఉన్న అల్లు అర్జున్ ను విచారణ పేరిట పోలీసులు మళ్లీ అరెస్టు చేస్తారేమోనని ఆయన అభిమానులు భయపడుతున్నారు. మరోవైపు అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలని కూడా పోలీసులు కోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
(The above story first appeared on LatestLY on Dec 24, 2024 08:52 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

