Chiranjeevi Music Settings with Keeravani: తెలుగు ఇండ‌స్ట్రీలో పాత ఆన‌వాయితీని తిరిగి ప్రారంభించిన చిరంజీవి, విశ్వంభ‌ర సినిమా కోసం కీర‌వాణితో క‌లిసి మ్యూజిక్ సెట్టింగ్స్, ఎంత స‌ర‌దాగా సాగిందో చూడండి

చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా షూట్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వశిష్ఠ దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే గతంలో సినిమాలకు ముందు పాటలతోనే పని మొదలుపెట్టేవాళ్ళు. విశ్వంభరకు కూడా మళ్ళీ అలాగే పాటలతోనే పని మొదలుపెట్టారు.

Chiranjeevi Music Settings with Keeravani: తెలుగు ఇండ‌స్ట్రీలో పాత ఆన‌వాయితీని తిరిగి ప్రారంభించిన చిరంజీవి, విశ్వంభ‌ర సినిమా కోసం కీర‌వాణితో క‌లిసి మ్యూజిక్ సెట్టింగ్స్, ఎంత స‌ర‌దాగా సాగిందో చూడండి
Chiranjeevi Music Settings with Keeravani

Hyderabad, July 04: చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమా షూట్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వశిష్ఠ దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే గతంలో సినిమాలకు ముందు పాటలతోనే పని మొదలుపెట్టేవాళ్ళు. విశ్వంభరకు కూడా మళ్ళీ అలాగే పాటలతోనే పని మొదలుపెట్టారు. నేడు ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి (Mm Keeravani) పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన వాయిస్ ఓవర్ తో ఓ స్పెషల్ వీడియో షేర్ చేసాడు. గతంలో సినిమాలకు సంగీత దర్శకుడు ఆధ్వర్యంలో అందరూ మూవీ టీమ్ కూర్చొని పాటల డిస్కర్షన్ చేసుకొని ఫైనల్ చేసేవారు. ఇప్పుడు అలా జరగట్లేదు. విశ్వంభర సినిమాకు మళ్ళీ ఆ ఆనవాయితీ తీసుకొచ్చారు.

 

చిరంజీవి ఇంట్లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అతని టీమ్ తో విశ్వంభర మ్యూజిక్ సెట్టింగ్స్ పెట్టారు. ఈ మ్యూజిక్ సెట్టింగ్స్ లో చిరంజీవి, డైరెక్టర్ వసిష్ఠ, నిర్మాత అందరూ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో షేర్ చేసారు చిరంజీవి. ఈ వీడియోలో సరదాగా కీరవాణితో సంగీతం కంపోజ్ చేస్తూ ముచ్చటిస్తున్నారు. అలాగే చిరంజీవి ఆపద్భాంధవుడు సినిమాలోని ఓ సూపర్ హిట్ సాంగ్ ని కీరవాణి అక్కడే కంపోజ్ చేస్తూ పాడారు. చిరు కూడా ఎంజాయ్ చేస్తూ ఆ సంగీత కచేరీని ఆస్వాదించారు. ఈ వీడియో షేర్ చేసి మా ఆస్కారుడు MM కీరవాణికి పుట్టిన రోజు (MM Keeravani Birthday) శుభాకాంక్షలు, ఇలా సంగీత చర్చలు చేస్తుంటే పాత రోజులు గుర్తొస్తున్నాయి అని చిరంజీవి తన వాయిస్ తో వీడియోలో తెలిపారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. వీడియోలో కీరవాణి మ్యూజిక్ తో పాడుతుంటే చిరంజీవి చిన్నపిల్లాడిలా ఏంజాయ్ చేస్తుంటే ఎంతో బాగుంది అని భిమానులు అంటున్నారు.

(The above story first appeared on LatestLY on Jul 04, 2024 09:55 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).