iSmart Shankar Video: ఇస్మార్ట్ శంకర్ దిమాక్ ఖరాబ్ వీడియో సాంగ్ కిరాక్ ఉంది. ఈ వీడియో సాంగ్ చూస్తే చాలు ఒక్కసారే పది ఎనర్జీ డ్రింక్స్ తాగినంత బూస్టింగ్ వచ్చేస్తుంది.

హీరో రామ్ పోతినేనికి ఎనర్జిటిక్ స్టార్ అనే పేరు ఎందుకొచ్చిందో ఈ ఇస్మార్ట్ శంకర్ సాంగ్స్ లలో అతడి డాన్స్ చూస్తే అర్థమవుతుంది. దిమాక్ ఖరాబ్ సాంగ్ లో అయితే ఇద్దరు డబుల్ కా మీటా లాంటి హీరోయిన్లతో, డబుల్ ఎనర్జీతో రామ్ వేసిన స్టెప్పులు చూస్తే వారె వాహ్ అనాల్సిందే...

iSmart Shankar Video: ఇస్మార్ట్ శంకర్ దిమాక్ ఖరాబ్ వీడియో సాంగ్ కిరాక్ ఉంది. ఈ వీడియో సాంగ్ చూస్తే చాలు ఒక్కసారే పది ఎనర్జీ డ్రింక్స్ తాగినంత బూస్టింగ్ వచ్చేస్తుంది.
Dimaak Kharaab - Full Video Song Released | Photo Credits: Zee Music South

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ డైరెక్షన్‌లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా, నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) మరియు నభా నటేశ్ (Nabha Natesh) హీరోయిన్లుగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ (iSmart Shankar) ఇటీవల రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.  మణిశర్మ కంపోజ్ చేసిన ఒక్కో ఫాస్ట్ బీట్ దుమ్ములేపింది.  యూట్యూబ్‌లో ఈ పాటలకు సంబంధించిన పైరేటెడ్ వీడియోలకే మిలియన్లలో వ్యూస్ వచ్చాయంటే అవి ఎంత పెద్ద హిట్ అనేది స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు.  దిమాక్ ఖరాబ్ (Dimaak Kharaab) సాంగ్, ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్ మరియు బోనాల సాంగ్  ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంటాయి. ఈ సాంగ్స్ ఒరిజినల్ వీడియోస్ ఎప్పుడెప్పుడొస్తాయి అని చాలా మంది ఎదురుచూస్తుండగా, ఇంకా లేట్ చేయడం మంచిది కాదేమో అన్నట్లుగా డైరెక్టర్ పూరిజగన్నాథ్ "దిమాక్ ఖరాబ్" ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. విడుదలైన కొద్దిసేపటికే యూట్యూబ్‌లో లక్షల వ్యూస్‌తో ఈ సాంగ్ దూసుకుపోతుంది.  పూర్తిగా హైదరాబాదీ లిరిక్స్ తో, తీన్మార్ బీట్లతో దుమ్ములేపేలా ఉన్న ఈ పార్టీ సాంగ్ చూస్తే ఒక్కసారే పది ఎనర్జీ డ్రింక్స్ తాగినంత బూస్టింగ్ వచ్చి లేచి డాన్స్ చేయాలా అన్నంత ఎనర్జీ వస్తుంది.  ఏ పార్టీలోనేనైనా, ఈవెంట్లోనైనా ఈ పాటను రిపీటెడ్‌గా ప్లే చేస్తూవస్తున్నారు

Dimaak Kharaab ఫుల్ వీడియో సాంగ్ మీరూ చూసేయండి:

హీరో రామ్ పోతినేనికి ఎనర్జిటిక్ స్టార్ అనే పేరు ఎందుకొచ్చిందో ఈ ఇస్మార్ట్ శంకర్ సాంగ్స్‌లలో అతడి డాన్స్ చూస్తే అర్థమవుతుంది. దిమాక్ ఖరాబ్ సాంగ్‌‌లో అయితే ఇద్దరు డబుల్ కా మీటా లాంటి హీరోయిన్లతో, డబుల్ ఎనర్జీతో రామ్ వేసిన స్టెప్పులు చూస్తే వారె వాహ్ అనాల్సిందే. ఇప్పటివరకూ టాలీవుడ్‌‌లో అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇద్దరు ఒకరితో ఒకరు పోటీ అన్నట్లుగా డాన్స్ చేస్తారు. ఇంకా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నితిన్ లాంటి స్టార్లు కూడా డాన్స్‌లో ఇరగదీస్తారు. ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ లో రామ్ పోతినేని డాన్స్ చూస్తే వారందరినీ దాటేశాడా అనిపించకమానదు. ఇకపై అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఇంకా రామ్ చరణ్ వారి సినిమాల్లో డాన్స్‌ల కోసం మరింత కష్టపడాల్సి రావచ్చు. చూడాలి మన స్టార్స్ తమ డాన్స్‌తో టాలీవుడ్‌ను ఏ లెవెల్‌కి తీసుకెళ్తారో అనేది.

(The above story first appeared on LatestLY on Sep 20, 2019 04:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).