Sye Raa Mania: ఔరా అనిపిస్తున్న సైరా కటౌట్లు, 'ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. చిరంజీవి మెగాస్టార్' అంటూ మెగా అభిమానాన్ని చాటుకుంటున్న ఫ్యాన్స్, పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న 'నరసింహా రెడ్డి'
యన కెరియర్ లో 'సైరా' ఒక చారిత్రాత్మక సినిమాగా నిలిచిపోతుందని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాపై 'లేటెస్ట్‌లీ' రివ్యూ మరికొద్ది సేపట్లో రాబోతుంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి...
ఏ హీరోకైనా ఫ్యాన్స్ ఉండటం కామన్, కానీ సౌత్ ఇండియన్ హీరోలకు డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. ఇక చిరంజీవి లాంటి పెద్ద స్టార్ హీరోకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగే వేరు. ఇండియాలో అమితాబ్ బచ్చన్, రజినీకాంత్ అలాగే తెలుగు నుంచి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) దశాబ్దాలుగా తమ స్టార్ డమ్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా సౌత్ నుంచి సూపర్ స్టార్, మెగాస్టార్ లుగా వెలుగొందుతున్న రజినీకాంత్, చిరంజీవిల సినిమాలు విడుదలయినపుడు అభిమానుల క్రేజ్ ఒక రేంజ్ లో ఉంటుంది.
ఈరోజు మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహ రెడ్డి' (Sye Raa Narasimha Reddy) సినిమా విడుదల సందర్భంగా మెగా అభిమానులు 'సైరా' కోసం ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు ఔరా అని పిస్తున్నాయి. సైరా సందడి చేస్తున్న థియేటర్ల వద్ద మరియు ఆయా ప్రాంతాల్లో మెగా అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కటౌట్లు, పోస్టర్లు, పండగను మరిపించేలా సంబరాలు మెగాస్టార్ స్టామినా ఏంటో చాటిచెప్తున్నాయి.
ఔరా అనిపించేలా సైరా కటౌట్స్
భీమవరంలో దారిపొడవునా ఏర్పాటు చేసిన 250 ఫీట్ల పొడవైన సైరా కటౌట్ అబ్బురపరుస్తుంది. ఇందులో సైరా విడుదల వరకు జరిగిన ముఖ్యమైన హైలైట్స్, సైరా ప్రమోషన్ స్టిల్స్, చిరంజీవి- పవన్ కళ్యాణ్, మరియు రామ్ చరణ్ కు సంబంధించిన స్టిల్స్, మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు ఇలా అన్నీ పొందుపరిచారు. దీనిపై ఉపాసన రామ్ చరణ్ ట్వీట్ చేశారు. ఇంతటి ప్రేమను కురిపించిన అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
Upasana Ram Charan's tweet on 250 feet long 'Sye Raa' cut-out
Thank u for all the love #Bhimavaram #SyeRaaNarsimhaReddy #RamCharan pic.twitter.com/5wR3GNHr2E
— Upasana Konidela (@upasanakonidela) October 2, 2019
ఇక హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో గల సుదర్శన్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన మెగాస్టార్ చిరంజీవి భారీ కటౌట్ ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తుంది. ఆ కటౌట్ పై మూడు రంగుల పూలతో గజమాల వేసి చిరంజీవికి ఘనమైన సత్కారాన్ని అందించారు.
The 'Mega' Cut-out in Hyderabad
Fans in Hyderabad have garlanded a cut-out of veteran actor #Chiranjeevi on the release of his movie #SyeRaaNarsimhaReddy pic.twitter.com/w4MR17Rex2
— ANI (@ANI) October 2, 2019
ఇక ఈరోజు విడుదలైన 'సైరా నరసింహా రెడ్డి' మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఓవర్సీస్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకు రివ్యూవర్స్ అదిరిపోయే రేటింగ్స్ అందిస్తున్నారు. సినిమా ఒక రేంజ్ లో ఉందని, స్వాతంత్య్ర ఉద్యమాన్ని మునుపెన్నడూ లేని విధంగా సైరాలో చూపించారని చెప్తున్నారు. ఈ సినిమా కలెక్షన్లు 'బాహుబలి' ని మించిపోవడం గ్యారెంటీ అని చెప్తున్నారు. చిరంజీవి అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే, మెగాస్టార్ తన రేంజ్ ఏంటో మరోసారి చూపించారు. ఆయన కెరియర్ లో 'సైరా' ఒక చారిత్రాత్మక సినిమాగా నిలిచిపోతుందని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాపై 'లేటెస్ట్‌లీ' రివ్యూ మరికొద్ది సేపట్లో రాబోతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ కోసం మా వైబ్‌సైట్‌ని ఫాలో అవ్వండి.
(The above story first appeared on LatestLY on Oct 02, 2019 12:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

