Manchu Vishnu: ఆ హీరో ఆఫీసు నుంచే ఇదంతా, 18 యూట్యూబ్ చానళ్లపై కేసు పెట్టిన మంచు విష్ణు, నా కుటుంబంపై ట్రోలింగ్ చేసేందుకు ఏకంగా 21 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని వెల్లడి
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జిన్నా మూవీ ప్రమోషన్లో భాగంగా తనపై, తన కుటుంబంపై చేస్తున్న ట్రోల్స్‌పై స్పందించాడు. ఒక హీరో ఆఫీసు నుంచి నా మీద ట్రోల్స్ జరుగుతున్నాయి. నా కుటుంబంపై ట్రోలింగ్ చేసేందుకు ఏకంగా 21 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై ఆఫీస్ చిరునామాతో పాటుగా వారు వినియోగించే ఐపీ అడ్రస్‌లను కూడా సేకరించాను. త్వరలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమగ్ర ఆధారాలతో ఫిర్యాదు చేస్తా. అలాగే నన్ను, నా కుటుంబాన్ని ట్రోల్ చేస్తున్న 18 యూట్యూబ్ చానళ్లపై కూడా కేసులు పెడుతున్నా. ఈ ట్రోల్స్‌ని సాధారణంగా మేం పట్టించుకోము. కానీ జవాబు దారితనం కోసం కేసులు పెడుతున్నా’ అని విష్ణు అన్నాడు.
కాగా అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న జిన్నా సినిమా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్ 5న ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
(The above story first appeared on LatestLY on Sep 29, 2022 06:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).