Ramya Raghupathi: రూ. 40 లక్షలు మోసం, హీరో నరేష్ మూడో భార్యపై కేసు నమోదు చేసిన పోలీసులు, రమ్య వసూళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపిన నరేష్
తెలుగు సినీ నటుడు నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతిపై కేసు నమోదైంది. నరేష్‌పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తోందంటూ ఆమెపై గచ్చిబౌలి పోలిస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. నటుడు నరేష్‌కు రమ్య రఘుపతి (Ramya Raghupathi) మూడో భార్య.
తెలుగు సినీ నటుడు నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతిపై కేసు నమోదైంది. నరేష్‌పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తోందంటూ ఆమెపై గచ్చిబౌలి పోలిస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. నటుడు నరేష్‌కు రమ్య రఘుపతి (Ramya Raghupathi) మూడో భార్య. కాగా మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె ఈమె. ఎనిమిదేళ్ల క్రితం వీరికి వివాహమైంది. అయితే కొన్నాళ్ల క్రితం మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అయితే నరేష్ (Ex-Wife of Actor Naresh) సహా ఆయన కుటుంబంతో దిగిన ఫోటోలను అడ్డు పెట్టుకొని కొందరు మహిళల నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
నరేష్‌కు చెందిన ఆస్తులను తన ఆస్తులుగా చెప్పి అధిక వడ్డీ పేరుతో, రిజిస్ట్రేషన్ల పేరుతో కోట్లల్లో మోసానికి పాల్పడింది. దీనిపై గచ్చిబౌలి పోలిస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది.తాజాగా ఈ వివాదంపై స్పందించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు నరేష్.. రమ్య వసూళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పాడు. కాగా ప్రస్తుతం నరేష్‌తో రమ్య దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతున్నాయి.
రమ్య రఘుపతి నరేష్‌కి మూడో భార్య (Naresh Ex Wife Ramya Raghupathi ). అయితే నరేష్‌తో సన్నిహిత సంబంధాలు ఉండటంతో.. ఆ ఫొటోలు, అతని ఆస్తులు తనకే చెందుతాయని చెప్తూ రమ్య రఘుపతి కోట్ల రూపాయిలు అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. రమ్య రఘుపతి మోసాలు బయటపడటంతో ఆమె నరేష్‌కి మూడో భార్య అనేది హాట్ టాపిక్‌గా మారింది.
నరేష్ మొదటిగా సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెను వివాహం చేసుకున్నారు. వీరికి పుట్టిన అబ్బాయే హీరో నవీన్. ఇటీవలే నవీన్ హీరోగా పరిచయం అయ్యారు. మొదటి భార్యతో విభేదాల కారణంగా విడిపోయిన నరేష్ తరువాత రెండో పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి కూడా విడాకుల బాటపట్టడంతో.. 2010లో అనంతపురానికి చెందిన రమ్య రఘుపతిని మూడో పెళ్లి చేసుకున్నారు. ఆమెతో కూడా కొన్నాళ్లు కాపురం చేసిన తరువాత విడాకులు తీసుకున్నారు.
(The above story first appeared on LatestLY on Feb 23, 2022 03:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

