Singer Geeta Mali Dies: రోడ్డు ప్రమాదంలో సింగర్ గీతా మాలి మృతి, అమెరికా నుంచి ఇండియా తిరిగి వచ్చి మృత్యువాత, విచారం వ్యక్తం చేసిన పలువురు సినీ ప్రముఖులు

యునైటెడ్ స్టేట్స్ నుంచి తిరిగి వచ్చిన సింగర్ గీత మాలి, ఆమె భర్త భర్త విజయ్ తో కలిసి ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి వారి స్వస్థలమైన నాసిక్ కు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న హోండా సిటీ కారు, మధ్యాహ్నం 3 గంటల సమయంలో షాహాపూర్ సమీపంలో ....

Singer Geeta Mali Dies: రోడ్డు ప్రమాదంలో సింగర్ గీతా మాలి మృతి, అమెరికా నుంచి ఇండియా తిరిగి వచ్చి మృత్యువాత, విచారం వ్యక్తం చేసిన పలువురు సినీ ప్రముఖులు
File Photo of Singer Geet Mali.

Nashik, November 15:  మహారాష్ట్రలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మరాఠీ ప్లేబ్యాక్ సింగర్ (Marathi Singer) గీతా మాలి (Geeta Mali)  మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం థానే జిల్లాలోని ముంబై-ఆగ్రా హైవేపై గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

యునైటెడ్ స్టేట్స్ నుంచి తిరిగి వచ్చిన సింగర్ గీత మాలి, ఆమె భర్త భర్త విజయ్ తో కలిసి ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి వారి స్వస్థలమైన నాసిక్ కు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న హోండా సిటీ కారు, మధ్యాహ్నం 3 గంటల సమయంలో షాహాపూర్ సమీపంలో హైవే పక్కన నిలిపి ఉంచిన ఓ కంటైనర్ వాహనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గీత మాలి మరియు ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని షాహాపూర్ రూరల్ ఆసుపత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ గీత మాలి మృతి చెందారు.

గీత కొన్ని మరాఠీ చిత్రాలకు  పాటలు పాడారు.  సొంతంగా మ్యూజిక్ ఆల్బమ్‌లు కూడా చేసే వారు, అనేక స్టేజ్ షోలలో పాల్గొనేవారు. కెరియర్ లో ఎదుగుతున్న సమయంలో దురదృష్టవషాత్తూ రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోవడంతో పలువురు సినీ ప్రముఖులు, ఆమె స్నేహితులు, బంధువులు మరియు అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Nov 15, 2019 12:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).