Megastar Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు పండగే, చిరు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ ఇంద్ర రీ రిలీజ్‌, చిరు బర్త్ డే కానుక!

బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. అగ్ర హీరోలు నటించిన పలు సినిమాలు రీ రిలీజ్‌లోనూ సత్తాచాటుతున్నాయి.ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా రీ రిలీజ్‌కు రెడీ అయింది. చిరంజీవి కెరీర్‌లో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం ఇంద్ర.

Megastar Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు పండగే, చిరు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ ఇంద్ర రీ రిలీజ్‌, చిరు బర్త్ డే కానుక!
indra movie(X)

Hyd, July 24:  బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. అగ్ర హీరోలు నటించిన పలు సినిమాలు రీ రిలీజ్‌లోనూ సత్తాచాటుతున్నాయి.ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా రీ రిలీజ్‌కు రెడీ అయింది. చిరంజీవి కెరీర్‌లో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం ఇంద్ర. 200 రోజులకు పైగా ఆడిన ఈ చిత్రం చిరును మాస్‌ హీరోగా నిలబెట్టింది. ఇక ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

వాస్తవానికి ఇంద్ర సినిమా రిలీజ్ అయి కూడా 22 సంవత్సరాలు కావొస్తుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఇంద్ర సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు.

తొలిసారి ఫ్యాక్ష‌న్ మూవీలో న‌టించిన చిరంజీవి అద్భుత‌మైన ప‌ర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో చిరంజీవి నటనే కాదు డ్యాన్స్ ఇప్పటికి, ఎప్పటికి ఎవర్‌గ్రీనే. దర్శకుడు బి గోపాల్ అద్భుతంగా తెరకెక్కించారు.

చిరు బర్త్ డే సందర్భంగా రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించగా వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. చిరు సరసన సోనాలి బింద్రే, ఆర్తి అగ‌ర్వాల్ హీరోయిన్లుగా న‌టించ‌గా మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు. వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై అశ్వినీద‌త్ నిర్మించారు.  బిగ్ బాస్‌లోకి అమృత ప్రణయ్?, సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్‌, అఫిషియల్ క్లారిటీ వచ్చేనా?

(The above story first appeared on LatestLY on Jul 24, 2024 05:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).