Actor Ashok Kumar: నిత్యానందకు సిగ్గు లేదు, వాడి మాయలో పడి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు రంజిత విడాకులిచ్చింది, ఎమోషనల్ అయిన తండ్రి సీనియర్ నటుడు అశోక్ కుమార్

పాత సినిమాల్లో ఆరడుగుల ఎత్తుతో అందగాడిగా పేరు తెచ్చుకున్న నటుడు అశోక్‌ కుమార్‌ గుర్తు ఉండే ఉంటారు. గురువును మించిన శిష్యులు, బుద్ధిమంతులు.. వంటి సూపర్‌ హిట్స్‌ చిత్రాల్లో నటించిన ఆయనకు మంచి పేరు ఉంది. అయితే ఏమైందో ఏమో సడన్‌గా చిత్రపరిశ్రమకు గుడ్‌బై చెప్పారు.

Actor Ashok Kumar: నిత్యానందకు సిగ్గు లేదు, వాడి మాయలో పడి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు రంజిత విడాకులిచ్చింది, ఎమోషనల్ అయిన తండ్రి సీనియర్ నటుడు అశోక్ కుమార్
Actor Ashok Kumar (Photo-suman TV)

పాత సినిమాల్లో ఆరడుగుల ఎత్తుతో అందగాడిగా పేరు తెచ్చుకున్న నటుడు అశోక్‌ కుమార్‌ గుర్తు ఉండే ఉంటారు. గురువును మించిన శిష్యులు, బుద్ధిమంతులు.. వంటి సూపర్‌ హిట్స్‌ చిత్రాల్లో నటించిన ఆయనకు మంచి పేరు ఉంది. అయితే ఏమైందో ఏమో సడన్‌గా చిత్రపరిశ్రమకు గుడ్‌బై చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ తన ఫ్యామిలీ గురించి సంచలన విషయాలు బయటపెట్టారు.

ఆయన మాట్లాడుతూ.. మొదట నేను పోలీసాఫీసర్‌గా పని చేశాను. తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్‌లో ఓ హోటల్‌ నడిపాను. అయితే అందులో నష్టాలు రావడంతో అక్కడికి వెళ్లడమే మానేశాను. అది ఇంకా దివాలా తీయడంతో మా బావగారు వచ్చి ఆ హోటల్‌ చూసుకున్నారు. ఖాళీగా ఎందుకు ఉండటమని మద్రాసు వెళ్లాను.

సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం, చిన్న వయసులోనే అండాశయ క్యాన్సర్‌తో ప్రముఖ హాలీవుడ్‌ నటి సమంతా వైన్‌స్టెయిన్ మృతి

విలన్‌గా, సహాయ నటుడిగా సినిమాలు చేశాను. రామానాయుడు నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తా అన్నారు.చివరకు అక్కినేని నాగేశ్వరరావు మాటలు విని నన్ను తీసేసి జగ్గయ్యను హీరోగా పెట్టారు. దీంతో నా ఆత్మాభిమానం దెబ్బతింది. ఇలాంటి ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానా? ఇక్కడికి వచ్చి తప్పు చేశానేనని ఫీలయ్యాను. ఈ సినీ ఇండస్ట్రీకి నేను పనికి రాను అని అర్థమైంది. అందుకే సినిమాలు మానేశాను' అని చెప్పుకొచ్చారు.

నా కుటుంబమే నాకు శత్రువు. అమ్మాయిని చూడకుండానే పెళ్లి చేసుకున్నాను. తీరా మండపంలో చూశాక ఆమె నాకు నచ్చలేదు. కానీ చేసేదేం లేక మనసొప్పకపోయినా పెళ్లి చేసుకున్నాను. ఈ కారణం వల్లే ఉద్యోగానికి రాజీనామా చేశాను. కొన్నాళ్లకు తప్పు తెలుసుకున్నాను. నా వల్ల అమ్మాయిని బాధపడుతోందని తనను నాతోపాటే మద్రాసుకు తీసుకొచ్చాను.

మళ్లీ పెళ్లి చేసుకున్న నటుడు ఆశిష్ విద్యార్థి.. 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న నటుడు.. రూపాలి బారువాతో రిజిస్టర్ మ్యారేజి

మాకు ముగ్గురు ఆడపిల్లలు.. పెద్ద చదువులు చదివించాను. ముగ్గురికీ పెళ్లి చేశా.. ఇద్దరికి విడాకులయ్యాయి. రెండో అమ్మాయి రంజితకు స్వామి నిత్యానందతో పెళ్లి జరిగిందని వార్తలు వచ్చాయి. నాకది నిజమో, కాదో తెలియదు. వాళ్లిద్దరూ క్లోజ్‌గా ఉన్న ఫోటోలయితే ఉన్నాయి. ఒక్కటైతే నిజం.. నిత్యానంద వల్లే ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి విడాకులిచ్చింది. కోపంతో నేనోసారి నిత్యానంద దగ్గరకు వెళ్లి.. నీకు సిగ్గు అనిపించడం లేదా? నా కూతుర్ని నీ ఆశ్రమం నుంచి వెనక్కు పంపించు అని అడిగాను.

నా కోపాన్ని, బాధను అర్థం చేసుకునేవాళ్లే లేరు. నిత్యానంద మాయలో పడి నా ఇద్దరు కూతుళ్లు అతడి వెంటే వెళ్లారు. ఇప్పటికీ అతడితోనే ఉన్నారు. ఇదంతా భరించలేక నా భార్య అనారోగ్యానికి గురై మరణించింది. నా మూడో కూతురే నన్ను చూసుకుంటోంది. మిగతా ఇద్దరూ ఇంతవరకు నాకు ఒక్క ఫోన్‌ కూడా చేయలేదు' అని ఎమోషన్ అయ్యారు.

(The above story first appeared on LatestLY on May 26, 2023 04:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).