Naga Chaitanya - Sobhita Dhulipala Wedding Video(X)

Hyd, Dec 5: అక్కినేని నాగ చైతన్య - శోభిత ధూళిపాళ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. రాత్రి 8:13 గంటలకు శుభ ముహూర్తన జరిగిన ఈ పెళ్లి వేడుకును చూసేందుకు పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు, స్నేహితుల, సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు హాజరుకాగా పండుగ వాతావరణం నెలకొంది.

వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయ బద్ధంగా వీరి వివాహం జరిగింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో శోభిత మెడలో చైతూ తాళి కట్టారు. వేదికపై నాగార్జున, అమల, అఖిల్‌ అక్కినేని, వెంకటేశ్‌, దగ్గుబాటి సురేశ్‌ బాబు సహా ఇతర కుటుంబ సభ్యులు ఉండగా చైతూ.. శోభిత మెడలో తాళి కడుతున్న సమయంలో అఖిల్‌ ఈలలు వేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  అంగ‌రంగ వైభ‌వంగా నాగ‌చైత‌న్య‌, శోభిత పెళ్లి, నెట్టింట వైర‌ల్ అవుతున్న ఫోటోలు 

Here's Video:

చైతూ - శోభిత వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, సుబ్బిరామిరెడ్డి, హీరో కార్తి, రామ్‌చరణ్‌, రానా, నాని, కీరవాణితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Here's Nagarjuna Twitter: