Vakeel Saab: మన 'వకీల్ సాబ్' చాలా స్టైలిష్! బాలీవుడ్ వెర్షన్‌లోని అమితాబ్ లుక్ కి, తమిళ వెర్షన్‌లోని అజిత్ లుక్‌కి భిన్నంగా ఉన్న పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్

ఈ కథలో లాయర్ పాత్ర ఎంతో నిస్వార్థమైనది, సేవాగుణం కలది, తనకు కీడు తలపెట్టాలని చూసినా, తనని అసహ్యించుకున్నా, ఎవరికైనా ఏదో సహాయం చేయాలనే తపన గల ఉదాత్తమైన పాత్ర అది. అలాంటి పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. అయితే పింక్ లో లాయర్ అమితాబ్ బచ్చన్ లుక్ ఎలా ఉంటుందో, తమిళ రీమేక్ లో లాయర్ అజిత్ లుక్ కూడా అలాగే ఉంటుంది......

Vakeel Saab: మన 'వకీల్ సాబ్' చాలా స్టైలిష్! బాలీవుడ్ వెర్షన్‌లోని అమితాబ్ లుక్ కి,  తమిళ వెర్షన్‌లోని అజిత్ లుక్‌కి భిన్నంగా ఉన్న పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్
Vakeel Saab First Look (Photo Credits: Twitter)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రెండేళ్ల విరామం తర్వాత మళ్ళీ ఆన్ స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. ఆయన నటిస్తున్న కొత్త చిత్రం "వకీల్ సాబ్" (Vakeel Saab) ఫస్ట్ లుక్ పోస్టర్ సోమవారమే విడుదలైంది. 2016లో విడుదలై బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన 'పింక్'  (Pink) సినిమాకు ఇది రీమేక్. పింక్ లో అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రనే వకీల్ సాబ్ గా పవన్ పోషిస్తున్నారు. ఇదే సినిమా తమిళంలో నెర్కొండ పార్వయి Nerkonda Paarvai గా 2019లో విడుదలై అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా కథలో పెద్ద విశేషం ఏమి లేకపోయినా, కథనం మరియు లాయర్ పాత్ర చాలా గొప్ప ఉంటుంది. కథలో ముగ్గురు లేడీ బ్యాచిలర్స్ ఒక ఇంట్లో అద్దెకు ఉంటారు. అయితే వారు ఊహించని విధంగా ఒక పోలీసు కేసులో చిక్కుకుంటారు. అయితే వారి పట్ల సమాజం, కుటుంబ సభ్యులు చూసే తీరు దారుణంగా ఉంటుంది. కానీ, పొరుగింట్లో చూడటానికి ఓ మామూలు మనిషిగా, నిరాడంబరంగా కనిపించే వ్యక్తి, ఒక లాయర్ ఆ అమ్మాయిల కష్టాన్ని చూసి, తనకుతానుగా స్పందించి చాకచక్యంగా ఆ కేసులో నుంచి వారిని బయటపడేస్తాడు. వకీల్ సాబ్‌లో అంజలి, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ కథలో లాయర్ పాత్ర ఎంతో నిస్వార్థమైనది, సేవాగుణం కలది, తనకు కీడు తలపెట్టాలని చూసినా, తనని అసహ్యించుకున్నా, ఎవరికైనా ఏదో సహాయం చేయాలనే తపన గల ఉదాత్తమైన పాత్ర అది. అలాంటి పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. అయితే పింక్ లో లాయర్ అమితాబ్ బచ్చన్ లుక్ ఎలా ఉంటుందో, తమిళ రీమేక్ లో లాయర్ అజిత్ లుక్ కూడా అలాగే ఉంటుంది.

Have a look of 'their' looks:

Ajith in Nerkonda Paarvai & Amitabh in Pink | File Photo

కానీ, నిన్న విడుదలైన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌  ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే మాత్రం, అందుకు భిన్నంగా, స్టైలిష్‌గా ఉంది. బాలీవుడ్ తెలుగు రీమేక్‌కి 'వకీల్ సాబ్' తనదైన స్పిన్ ఇవ్వడం ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుంది.

ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ చిత్రం ఎంతో ప్రత్యేకమైనది. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు.

(The above story first appeared on LatestLY on Mar 03, 2020 11:54 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).