Megastar Chiranjeevi: చిరంజీవికి అవార్డు రావడంపై ప్రధాని మోదీ ప్రశంసలు, చిరంజీవి ఒక విలక్షణమైన నటుడంటూ తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని
టాలీవుడ్ అగ్ర నటుడు చిరంజీవికి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ - 2022 అవార్డు వచ్చిన సంగతి విదితమే. తాజాగా అవార్డు రావడంపై భారత ప్రధాని నరేంద్రమోదీ మెగాస్టార్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. అవార్డుకు ఎంపికైనందుకు మెగాస్టార్‌కు ప్రధాని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో ట్వీట్ చేశారు.

ట్వీట్‌లో ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ.. 'చిరంజీవి ఒక విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానం, ఆదరణ చూరగొన్నారు'. అంటూ పోస్ట్ చేశారు. గోవాలో జరుగుతోన్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డుకు మెగాస్టార్ ఎంపికయ్యారు. పనాజీలో ఆదివారం ప్రారంభమైన ఇఫి వేడుకలు ఈ నెల 29 వరకు జరగనున్నాయి.
చిరంజీవి గారు విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్నీ , ఆదరణనూ చూరగొన్నారు. https://t.co/yQJsWL4qs8
— Narendra Modi (@narendramodi) November 21, 2022
(The above story first appeared on LatestLY on Nov 21, 2022 06:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).