Pushpa 2 New Record: పుష్ప-2 ఖాతాలో మరో రికార్డు, అమెరికాలో ప్రీ సేల్స్‌ బుకింగ్స్ ఓపెన్‌ చేయగానే 15 వేల టికెట్లు హాట్ సేల్, ఇంత వేగంగా బుకింగ్స్‌ జరగడం ఇదే తొలిసారి

అల్లు అర్జున్‌, సుకుమార్‌ల కలయికలో రాబోతున్ననాలుగో చిత్రం 'పుష్ప-2 ది రూల్‌'. పుష్ప-2' ది రూల్‌ గురించి ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో వున్న ఈ చిత్రాన్ని డిసెంబరు 5న విడుదల చేస్తున్నారు.

Pushpa 2 New Record: పుష్ప-2 ఖాతాలో మరో రికార్డు,  అమెరికాలో ప్రీ సేల్స్‌ బుకింగ్స్ ఓపెన్‌ చేయగానే 15 వేల టికెట్లు హాట్ సేల్, ఇంత వేగంగా బుకింగ్స్‌ జరగడం ఇదే తొలిసారి
Allu Arjun Pushpa 2: The Rule Locks First Half pre-release business worth Rs 1000 crore Report

అల్లు అర్జున్‌, సుకుమార్‌ల కలయికలో రాబోతున్ననాలుగో చిత్రం 'పుష్ప-2 ది రూల్‌'. పుష్ప-2' ది రూల్‌ గురించి ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో వున్న ఈ చిత్రాన్ని డిసెంబరు 5న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పలు రికార్డులను నెలకొల్పిన పుష్ప-2 చిత్రం తన రికార్డుల ఖాతాలో మరో ఘనతను నమోదు చేసుకుంది. అమెరికాలో ఈ చిత్రం ప్రీ సేల్స్‌ బుకింగ్స్ ఓపెన్‌ చేయగా టికెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి.

అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారన్న పిటిషన్‌ను క్వాష్ చేస్తూ హైకోర్టు తీర్పు, వ్యక్తిగత పర్యటన కోడ్ ఉల్లంఘన కిందకు రాదన్న న్యాయస్థానం

అత్యంత వేగంగా 15 వేల టికెట్లు సేల్‌ అయినట్లుగా నిర్మాతలు తెలిపారు. ఇది ఓవర్సీస్‌లో హీరో కెరీర్‌లోనే ఆల్‌టైమ్‌ రికార్డుగా ప్రకటించారు. అంతేకాదు ఓ భారతీయ చిత్రానికి ఇంత వేగంగా ఇంతటి స్థాయిలో బుకింగ్స్‌ జరగడం ఇదే తొలిసారి అని మేకర్స్‌ విడుదల చేసిన పోస్టర్‌లో తెలిపారు. ఇక తమ హీరో ఖాతాలో నమోదైన మరో రికార్డును తెలుసుకుని అల్లు అర్జున్‌ అభిమానులు సంతోషపడుతున్నారు.

(The above story first appeared on LatestLY on Nov 06, 2024 10:17 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).