Kobbari Matta: ప్రపంచ రికార్డ్ బద్దలుకొట్టిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. గుక్క తిప్పుకోకుండా 3:27 నిమిషాల డైలాగ్‌ను సింగిల్ టేక్‌లో చెప్పేసిన సంపూ. మావాడు తోపు అంటున్న అతడి డైహార్డ్ ఫ్యాన్స్.

ఎవరి పేరు చెప్తే ప్రపంచ రికార్డులు ముక్కలుముక్కలవుతాయో, ఎవరి సినిమా రిలీజ్ అయితే బాహుబలి కలెక్షన్లు సైతం చిన్నబోతాయో అతడే అతడే అతడే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు...

Kobbari Matta: ప్రపంచ రికార్డ్ బద్దలుకొట్టిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. గుక్క తిప్పుకోకుండా 3:27 నిమిషాల డైలాగ్‌ను సింగిల్ టేక్‌లో చెప్పేసిన సంపూ. మావాడు తోపు అంటున్న అతడి డైహార్డ్ ఫ్యాన్స్.

'చెప్పివచ్చే తుఫాన్ కాదు వాడు, వచ్చాక చెప్పుకునే సునామీ వాడు'. ఈ ఒక్క ఇంట్రొడొక్షన్ డైలాగ్ సరిపోదా ఆ స్టార్ స్టేచర్ ఎంత గొప్పదో అర్థం చేసుకోవడానికి? ఎవరి పేరు చెప్తే ప్రపంచ రికార్డులు ముక్కలుముక్కలవుతాయో, ఎవరి సినిమా రిలీజ్ అయితే బాహుబలి కలెక్షన్లు సైతం చిన్నబోతాయో అతడే అతడే అతడే బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. ఎంతపెద్ద స్టార్ అయినప్పటికీ అభిమానుల ప్రేమకు మాత్రం అతడు ఎప్పుడూ బానిసే. అందుకే అతణ్ని అభిమానులు ముద్దుగా సంపూ అని పిలుచుకుంటారు.

ఇక అసలు విషయానికి వస్తే, బాబు అభిమానులు పండగ చేసుకునే వార్త. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఎప్పట్నించో నటిస్తున్న 'కొబ్బరిమట్ట' సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఆగష్టు 10, 2019న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సినిమా యూనిట్ సిద్ధమైంది. ఈ సందర్భంగా ఒక డైలాగ్ టీజర్ విడుదల చేశారు. ఇందులో సంపూర్ణేష్ బాబు ఆపకుండా ఏకధాటిగా 3 నిమిషాల 27 సెకన్ల పాటు డైలాగ్ చెపాడు, అది కూడా సింగిల్ టేక్ లో. సింహాంలే బెదిరిపోయేలా ఉన్న సంపూ భీకర డైలాగ్ గర్జన ధాటికి ప్రపంచ రికార్డ్ బద్దలైంది. ఇంతవరకూ ఎవరూ కూడా 3 నిమిషాలకు పైగా డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పేయడం ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరగనిదని చిత్రబృందం పేర్కొంటుంది. ఈ ఒక్క డైలాగ్ చిత్రీకరణ కోసమే రూ. 3లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు 'కొబ్బరిమట్ట' సినిమా నిర్మాత సాయి రాజేశ్ అలియాస్ స్టీవెన్ శంకర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

ఈ 'కొబ్బరిమట్ట' సినిమా గురించి చెప్పాలంటే 2014 నుంచి ఈ సినిమా పేరు వినిపిస్తుంది. 2015లోనే ఈ సినిమా రిలీజ్ చేస్తామని చెప్పారు. అయితే ఎన్నో 'సినిమా కష్టాల'కు ఓర్చి మొత్తానికి 2019లో సినిమా నిర్మాణం పూర్తి చేశారు. సంపూతో 'హృదయ కాలేయం' సినిమా చేసిన స్టీవెన్ శంకరే ఈ 'కొబ్బరిమట్ట' సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే మరియు నిర్మాత బాధ్యతలు చేపట్టగా, రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు.

కథపరంగా ఈ సినిమాలో సంపూ పాపారాయుడు, పెదరాయుడు మరియు ఆండ్రాయిడుగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. హీరోయిన్ గా ఇషికా సింగ్ నటిస్తుంది. షకీలా, కత్తి మహేశ్, గాయత్రీ గుప్తా లాంటి సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

సంపూ భారీ డైలాగ్ తో ఇప్పటికే ఈ సినిమాకి పబ్లిసిటీ వచ్చేసింది. సంపూ ఫ్యాన్స్ ఈ డైలాగ్ టీజర్ పట్ల పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. సంపూకి సపోర్ట్ గా సంపూర్ణేశ్ బాబు.. తోపు దమ్ముంటే ఆపు, సంపూ చింపేసే టైం స్టార్ట్ అయింది అంటూ మంచిమంచి కమెంట్స్ చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Jul 30, 2019 01:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).