Shyamala condemns -Chiranjeevi-comments at Brahmanandam movie pre release

వారసత్వం గురించి చిరంజీవి చేసిన కామెంట్స్‌పై స్పందించారు నటి, వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల(Shyamala On Chiranjeevi Comments). బ్రహ్మా ఆనందం ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi).

ఈ సందర్భంగా తన ఇంట్లో చుట్టూ మనవరాల్లే ఉంటారని.. తనకు లేడీస్ హాస్టల్ వార్డెన్‌లా అనిపిస్తుందని కామెంట్ చేశారు. అంతేగాదు ఇప్పుడైనా కొడుకును కనాలని చరణ్‌కు చెబుతుంటానంటూ తెలిపారు.

నోరు జారిన మెగాస్టార్ చిరంజీవి.. మీమ్స్‌లో ఎర్రి.... మొహం పెడతాడు కదా! అంటూ బూతు, నాలుక కరుచుకున్న చిరు, వైరల్‌గా మారిన వీడియో

ఈ వ్యాఖ్యలపై స్పందించారు శ్యామల(YSRCP Shyamala). వారసుడు అంటే అబ్బాయి మాత్రమే కాదు.. కొడుకే వార‌సుడు అవుతాడా.. కూతుర్లు కారా అని ప్ర‌శ్నించారు. వారసుడు అనేవాళ్ళు కొడుకు అనే భ్ర‌మ నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుందని చెప్పారు. ఇక నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో చిరుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

Chiru comments on grand son

ఇక అలాగే ఇదే స్టేజ్ పై బండబూతులు వాడారు చిరంజీవి. ఇప్పుడు మీమ్స్(Meems) లో మొహం పెడతాడు కదండీ(అని బ్రహ్మానందం)ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎర్రి $%#%^ మొహం(Obscene Word) పెడతాడు కదా అంటూ కామెంట్ చేసిన నాలుక కరుచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అలాగే రాజకీయాల గురించి సంచలన కామెంట్ చేశారు చిరు. ఈ మధ్య నేను వాళ్ళకి వీళ్ళకి దగ్గరయ్యాను ఫలానా పార్టీలో చేరుతానని అనుకుంటున్నారు కానీ అలాంటిది ఏమీ లేదు.. రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తేలేదన్నారు. రాజకీయాల పరంగా నేను అనుకున్న లక్ష్యాలను, సేవా భావాలను పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని సంచలన కామెంట్ చేశారు చిరు.

 Shyamala On Chiranjeevi Comments

Chiru slips Tongue