Tamannaah Covid-19: తమన్నాకు కరోనావైరస్, ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న మిల్కీ బ్యూటీ, కొద్ది రోజుల క్రితమే కరోనా నుంచి కోలుకున్న తమన్నా తల్లిదండ్రులు

మిల్కీ బ్యూటీ తమన్నా కరోనా బారిన పడ్డారు. తీవ్ర జర్వంతో బాధపడుతున్న ఆమెకు కరోనా పాజిటివ్‌గా (Tamannaah test positive for coronavirus) నిర్ధారణ అయింది. ఆమె చికిత్స కోసం ప్రయివేటు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. తమన్నా తల్లిదండ్రులకు ఇటీవల కరోనా సోకింది. అయితే వారు ఆ వ్యాధిని జయించి సురక్షితంగా ఆ మహమ్మారి బారి నుంచి బయటపడ్డారు. అయితే ఇప్పుడు తమన్నాకు కరోనా వైరస్ సోకింది. త‌మ‌న్నాకు (Tamannaah Bhatia) క‌రోనా సోకింద‌నే విష‌యం తెలుసుకున్న ఆమె అభిమానులు షాక్ అవ్వ‌డంతో పాటు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధిస్తున్నారు.

Tamannaah Covid-19: తమన్నాకు కరోనావైరస్, ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న మిల్కీ బ్యూటీ, కొద్ది రోజుల క్రితమే కరోనా నుంచి కోలుకున్న తమన్నా తల్లిదండ్రులు
(Tamannaah Bhatia: Photo Credits: Instagram)

మిల్కీ బ్యూటీ తమన్నా కరోనా బారిన పడ్డారు. తీవ్ర జర్వంతో బాధపడుతున్న ఆమెకు కరోనా పాజిటివ్‌గా (Tamannaah test positive for coronavirus) నిర్ధారణ అయింది. ఆమె చికిత్స కోసం ప్రయివేటు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. తమన్నా తల్లిదండ్రులకు ఇటీవల కరోనా సోకింది. అయితే వారు ఆ వ్యాధిని జయించి సురక్షితంగా ఆ మహమ్మారి బారి నుంచి బయటపడ్డారు. అయితే ఇప్పుడు తమన్నాకు కరోనా వైరస్ సోకింది. త‌మ‌న్నాకు (Tamannaah Bhatia) క‌రోనా సోకింద‌నే విష‌యం తెలుసుకున్న ఆమె అభిమానులు షాక్ అవ్వ‌డంతో పాటు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం త‌మ‌న్నా త‌ల్లిదండ్రుల‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ఫ్యామిలీతో పాటు సిబ్బంది అంద‌రికి క‌రోనా ప‌రీక్ష‌లు చేయించింది త‌మ‌న్నా. ఈ ప‌రీక్ష‌ల‌లో త‌ల్లిదండ్రుల‌కు పాజిటివ్ గా తేల‌గా..త‌మ‌న్నాతోపాటు మిగిలిన సిబ్బందికి నెగెటివ్ వ‌చ్చింది. అయితే ఇటీవ‌ల త‌మ‌న్నా త‌ల్లిదండ్రులు క‌రోనా నుండి కోలుకోగా, ప్ర‌స్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు. ఇటీవల షూటింగ్స్ మొదలు కావడంతో హైదరాబాద్‌కు రావాల్సి వచ్చింది. ఆమె తదుపరి ప్రాజెక్ట్ కోసం బిజీ అవుతున్న తరుణంలో సడన్ గా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ (Tamannaah Covid 19) అని తేలింది.

చేసిన సేవకు గుర్తింపు, సోనూసూద్‌‌ను ఎస్‌డీజీ స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్‌ అవార్డుతో సత్కరించిన యూఎన్‌డీపీ, ఐరాస గుర్తించిన వారిలో సోనూసూద్‌ తొలి భారతీయ నటుడు

ఆహా యాప్ లో తమన్నా ఒక టాక్ షో చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన షూటింగ్ కోసం రేడి అవుతుండగా అనుకోకుండా ఈ వైరస్ భారిన పడ్డట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కు వచ్చే ముందే తమన్నాకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. తమన్నాకు సంబంధించిన పూర్తి రిపోర్ట్స్ వచ్చిన తరువాత ఇన్ఫెక్షన్ స్థాయి ఎలా ఉందో తెలియనుంది. ఇక తమన్నా 15రోజుల పాటు షూటింగ్స్ కి దూరం కానుంది. ప్రస్తుతం ఆమె ఒక వెబ్ సీరిస్ తో పాటు గుర్తుంది శీతాకాలం అనే సినిమా చేస్తోంది. అలాగే గోపిచంద్ హీరోగా తెరకెక్కుతున్న సీటిమార్ సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. ఆ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నాడు.

(The above story first appeared on LatestLY on Oct 04, 2020 03:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).