Bijili Ramesh Passes Away: తమిళ నటుడు బిజిలి రమేష్‌ కన్నుమూత, ప్రాంక్ వీడియోలతో ఫేమస్, కోలీవుడ్‌లో విషాదం

తమిళ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు బిజిలి రమేష్ ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందారు. పక్షవాతంతో చాలాకాలంగా మంచానికే పరిమితమయ్యారు రమేష్. అయితే పరిస్థితి విషమించగా ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందారు.

Bijili Ramesh Passes Away: తమిళ నటుడు బిజిలి రమేష్‌ కన్నుమూత, ప్రాంక్ వీడియోలతో ఫేమస్, కోలీవుడ్‌లో విషాదం
Tamil Actor Bijili Ramesh Passes Away

Hyd, Aug 27: తమిళ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు బిజిలి రమేష్ ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందారు. పక్షవాతంతో చాలాకాలంగా మంచానికే పరిమితమయ్యారు రమేష్. అయితే పరిస్థితి విషమించగా ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందారు.

బ్లాక్‌షీప్ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రాంక్ వీడియోలతో ఫేమస్ అయ్యారు రమేష్. ఈ క్రమంలోనే సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. హిప్‌హాఫ్ ఆది నటించిన 'నట్బే సబ్' సినిమాతో వెండితెర ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత పొన్‌మగల్ వండాల్, అడై , కోమలి , జోంబీ వంటి చిత్రాలలో నటించి మెప్పించారు. మంచు ఫ్యామిలీ నుంచి మరో వారసుడు, కన్నప్పలో తిన్నడుగా మంచు విష్ణు కుమారుడు అవ్రామ్

Here's Tweet:

అయితే మద్యం సేవించి వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన రమేష్, అదే అలవాటు కారణంగా పక్షవాతానికి గురయ్యారు. పలు ఇంటర్వ్యూల్లో ఇదే విషయాన్ని వెల్లడించారు రమేష్. ఆయన మృతితో కోలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌కు వీరాభిమాని రమేషణ్. ఆయన స్పూర్తితోనే ఇండస్ట్రీలోకి వచ్చానని పలు సందర్భాల్లో తెలిపారు.

(The above story first appeared on LatestLY on Aug 27, 2024 11:03 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).