This Week Movies- OTT Releases: ఈవారం థియేటర్స్, ఓటీటీల్లో విడుదలైన కొత్త సినిమాలు, సంక్షిప్త రివ్యూలు, రాబోయే చిత్రాల విశేషాలు!
This Week Movies- OTT Releases: ఈవారం రిపబ్లిక్ వేడుకలతో పాటు కొత్త సినిమాలు మిమ్మల్ని అలరించనున్నాయి. జనవరి 26, 2024న థియేటర్లలో విడుదలైన సినిమాలు, క్లుప్తంగా వాటి రివ్యూలు, అలాగే ఈరోజు నుంచి వివిధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉండనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల వివరాలు, రాబోయే చిత్రాల విశేషాలను ఇక్కడ తెలియజేస్తున్నాం.
సంక్రాంతి సందర్భంగా ఇప్పటికే చాలా తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి అయితే ఇవి మరికొన్ని రోజుల్లోనే OTT ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటాయి. అయితే కొన్ని తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదలకు ముందే డిజిటల్ విడుదల తేదీలను ప్రకటిస్తున్నాయి. వివరాలు చూడండి..
ఈవారం థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాలు
కెప్టెన్ మిల్లర్ (తెలుగు): ధనుష్, శివరాజ్ కుమార్, సందీప్ కిషన్, నివేదిత, ప్రియాంక మోహన్ నటించారు. బ్రిటీష్ కాలంలో ఒక గ్రామం నుంచి విలువైన బొమ్మను దొంగలిస్తే, హీరో దానిని తిరిగి ఎలా సాధిస్తాడు అనేది కథాంశం. ఈ మూవీ రివ్యూ చూస్తే యావరేజ్ టాక్ వినిపిస్తోంది.
ఫైటర్ (హిందీ): హృతిక్ రోషన్, దీపిక పడుకోన్ నటించారు. దేశభక్తి నేపథ్యంలో సాగే ఎయిర్ ఫోర్స్ యాక్షన్ డ్రామా. కథలో కొత్తదనం లేకపోయినా, యాక్షన్ నిండుగా ఉందని టాక్.
105 మినిట్స్ (తెలుగు): హన్సిక నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమా భయపెట్టదు కానీ, సహనాన్ని పరీక్షిస్తుందని కొన్ని రివ్యూలు వచ్చాయి.
ఈవారం ఓటీటీలోకి వచ్చినవి
పేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న యానిమల్ మువీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇంకా ఏమేం విడుదలయ్యాయంటే..
యానిమల్ (తెలుగు డబ్) 26 జనవరి 2024 నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్
లిటిల్ మిస్ నైనా 25 జనవరి 2024 ETV విన్ ఫిల్మ్
నెరు (తెలుగు డబ్) 23 జనవరి 2024 డిస్నీ+ హాట్‌స్టార్ ఫిల్మ్
సలార్ 20 జనవరి 2024 నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్
గుంటూరు కారం-త్వరలో- నెట్‌ఫ్లిక్స్
హనుమాన్- త్వరలో- జీ5 ఫిల్మ్
నా సామి రంగ -త్వరలో- డిస్నీ+ హాట్‌స్టార్ ఫిల్మ్
సైంధవ్ -త్వరలో- అమెజాన్ ప్రైమ్ వీడియో
(The above story first appeared on LatestLY on Jan 26, 2024 03:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

